TS News: అంబేడ్కర్‌నగర్‌లోని స్థలాలను రెగ్యులరైజ్ చేస్తాం: మంత్రి తలసాని

ABN , First Publish Date - 2022-07-22T21:40:07+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, ఎవరు ఆందోళన చెందవద్దని GO 58 క్రింద అంబేడ్కర్‌నగర్‌లోని స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామని మంత్రి తలసాని..

TS News: అంబేడ్కర్‌నగర్‌లోని స్థలాలను రెగ్యులరైజ్ చేస్తాం:  మంత్రి తలసాని

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని,  GO 58 క్రింద అంబేడ్కర్‌నగర్‌లోని స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ (Talasani Srinivasyadav) అన్నారు. మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కలెక్టర్ అమయ్ కుమార్, ఆర్డీవో వసంత కుమారి, తహసీల్దార్, కార్పొరేటర్లతో అంబేడ్కర్‌నగర్‌లో జరిగిన సంఘటనపై మంత్రి  సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 46లోని అంబేడ్కర్‌నగర్‌లో చోటుచేసుకున్న సంఘటన బాధాకరమని చెప్పారు. ఒక అధికారి చేసిన తప్పిదం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. కేసీఆర్(KCR) నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తుందని తెలిపారు. వారం రోజుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి అంబేడ్కర్‌నగర్‌లో పర్యటిస్తామన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు ఈ సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారితో ఎలాంటి ప్రయోజనం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు.

Updated Date - 2022-07-22T21:40:07+05:30 IST