అసెంబ్లీలో మంత్రి తలసాని వర్సెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2022-03-14T21:44:29+05:30 IST

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే

అసెంబ్లీలో మంత్రి తలసాని వర్సెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చర్చ జరిగే సమయంలో పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. కోమటిరెడ్డిని తలసాని కాంట్రాక్టర్‌తో పోల్చాడు. దీంతో తలసానికి కోమటిరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చాడు. తాను కాంట్రాక్టర్‌ను అయితే పేకాట ఆడినోళ్లు మంత్రులు కావొచ్చంటూ సెటైర్లు వేశారు. దీంతో కోమటిరెడ్డిపై టీఆర్‌ఎస్ నేతలు అటాక్ చేశారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ, విప్ బాల్క సుమన్‌లు కోమటిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఎదురు దాడికి దిగారు. 

Updated Date - 2022-03-14T21:44:29+05:30 IST