స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉష శ్రీ చరణ్

ABN , First Publish Date - 2022-04-14T16:24:47+05:30 IST

స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉష శ్రీ చరణ్ గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు.

స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉష శ్రీ చరణ్

అమరావతి: స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా  ఉష శ్రీ చరణ్ గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఛాంబర్లోకి మంత్రి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఉష శ్రీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. వెనుకబడిన కులాల నుండి వచ్చిన తనకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా జగన్ నియంనించారని అన్నారు. బీసీలు అంటే ఓట్ బాంక్‌గా మాత్రమే గత ప్రభుత్వాలు చూసాయని విమర్శించారు. ముఖ్యమంత్రి ఏ నమ్మకం అయితే తమపై పెట్టారో దాన్ని నిలబెట్టుకుంటానన్నారు. మహిళా సంక్షేమం జరగాలంటే రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా ఎదగాలని మంత్రి తెలిపారు. ప్రతి ఇంట్లో మహిళలకు ఆదరణ దక్కాలన్నారు. ఆమె పేరుతోనే ఈ ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు అందిస్తోందని చెప్పారు. అంబేద్కర్ జయంతి రోజు ఛార్జ్ తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని,  ఎలాంటి రాజకీయ చరిత్ర లేని తనకు జగన్ ఈ అవకాశం కల్పించారని ఉష శ్రీ చరణ్ హర్షం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-04-14T16:24:47+05:30 IST