అప్పన్నకు పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి వెలంపల్లి

ABN , First Publish Date - 2021-05-11T04:38:39+05:30 IST

ఈనెల 14న జరగనున్న సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం చందనోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

అప్పన్నకు పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి వెలంపల్లి

సింహాచలం, మే 10: ఈనెల 14న జరగనున్న సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం చందనోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి డా.జి వాణీమోహన్‌ సోమవారం జీవో జారీ చేశారు. సింహాచల దేవస్థానం పాలక మండలి తీర్మానం ప్రకారం ఏకాంతంగా జరిగే చందనోత్సవం రోజున స్వామివారికి భక్తుల గోత్రనామాలతో పరోక్ష పద్ధతిలో పూజలు చేసేందుకు రూ.1,116లు చెల్లించేందుకు అనుమతులు మంజూరు చేశారు. భక్తుల గోత్రనామాలు చదివే అంశాన్ని యూట్యూబ్‌లో ప్రసారం చేయడం జరుగుతుందని, అయితే మూలవిరాట్‌ను దర్శించడం జరగదని పేర్కొన్నారు. అలాగే భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా రూ.10,116, లేదా రూ.20,116లు విరాళాలు సమర్పించేందుకు అవకాశాన్ని కలిపిస్తున్నామని, దాతలకు 200 గ్రాములు లేదా 300 గ్రాముల చందనపు చెక్కను ప్రసాదంగా అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

Updated Date - 2021-05-11T04:38:39+05:30 IST