పాదగయలో మంత్రి వేణు పూజలు

Sep 26 2021 @ 23:27PM
పాదగయ క్షేత్రంలో మంత్రి వేణు దంపతులు

పిఠాపురం, సెప్టెంబరు 26: పిఠాపురం పట్టణంలోని పాదగయ క్షేత్రాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దంపతులు ఆదివారం సందర్శించారు. పాదగయలోని కుక్కుటేశ్వరస్వామి, దత్తాత్రేయస్వామి, రాజరాజేశ్వరీదేవి, పుర్హుతికాఅమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు క్షేత్రప్రాశస్త్యాన్ని వివరించి ఆశ్వీరచనాలు పలికారు. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు మంత్రి దంపతులను శేషవస్త్రాలతో సత్కరించారు. కా ర్యక్రమంలో ఆలయ ఈవో సౌజన్య తదితరులు పాల్గొన్నారు.


సత్యదేవుడి సన్నిధిలో...

అన్నవరం, సెప్టంబరు 26: సత్యదేవుడి సన్నిధిలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కుటుంబసభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ ఈవో త్రినాథరా వు, చైర్మన్‌ రోహిత్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనాలు అందించగా ఈవో స్వామివారి ప్రసాదం అందజేశారు. గ్రామ సర్పంచ్‌ శెట్టిబత్తుల కుమార్‌రాజా తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.