మంత్రి Vishwaroop కొడుకు కృష్ణారెడ్డి బెదిరింపుల ఆడియో వైరల్‌

ABN , First Publish Date - 2022-06-02T17:44:41+05:30 IST

మంత్రి విశ్వరూప్‌ కొడుకు కృష్ణారెడ్డి బెదిరింపుల ఆడియో వైరల్‌గా మారింది.

మంత్రి Vishwaroop కొడుకు కృష్ణారెడ్డి బెదిరింపుల ఆడియో వైరల్‌

కోనసీమ: మంత్రి విశ్వరూప్‌(Vishwaroop) కొడుకు కృష్ణారెడ్డి(Krishna reddy) బెదిరింపుల ఆడియో వైరల్‌గా మారింది. వైసీపీ ఎంపీటీసీ అడపా సత్తిబాబు(Adapa sattibabu)ను మంత్రి కొడుకు కృష్ణారెడ్డి  బెదిరించాడు. ‘‘నా ఇల్లు అంటిస్తారా.. మిమ్మల్ని చంపుతానంటూ’’ బూతులు తిడుతూ మంత్రి కొడుకు బెదిరింపులకు పాల్పడ్డాడు. అమలాపురం అల్లర్ల కేసులో వైసీపీ ఎంపీటీసీ అడపా సత్తిబాబుపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే జరిగిన సంఘటనతో తనకు సంబంధం లేకపోయినా వైసీపీలో మరో వర్గం తనను ఇరికించారంటూ ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశాడు. 

Updated Date - 2022-06-02T17:44:41+05:30 IST