మాతృమూర్తులకు మంత్రి శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2021-05-10T04:32:30+05:30 IST

అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు.

మాతృమూర్తులకు మంత్రి శుభాకాంక్షలు
తల్లి శాంతమ్మకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. సృష్ఠిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదన్నారు. పాలమూరు పట్టణంలో తన తల్లి శాంతమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. పాదాభివందనం చేసి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లి ప్రేమ ఎంతో స్వచ్ఛమైనదని, తల్లి నుంచి ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం వంటి సుగుణాలను మనం నేర్చుకుంటామని చెప్పారు. మహిళలు, మాతృమూర్తుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శమన్నారు.

- మహబూబ్‌నగర్‌ 

Updated Date - 2021-05-10T04:32:30+05:30 IST