Congressలో ప్రజాస్వామ్యం ఎండమావి

Published: Wed, 20 Jul 2022 12:48:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Congressలో ప్రజాస్వామ్యం ఎండమావి

                        - ట్వీట్లతో ధ్వజమెత్తిన మంత్రులు 


బెంగళూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎండమావేనని మంత్రులు ట్వీట్లతో ధ్వజమెత్తారు. బీజేపీ జాతీయ సంఘటనా కార్యదర్శి బీఎల్‌ సంతోష్ పై కాంగ్రెస్‌ ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో మంత్రులు డాక్టర్‌ కే సుధాకర్‌, డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ, ఆరగ జ్ఞానేంద్ర, గోవింద కారజోళ, బీసీ నాగేశ్‌, కే గోపాలయ్య, కోట శ్రీనివాస పూజారితోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ ట్వీట్ల యుద్ధం చేపట్టారు. బీజేపీలో సంతోష్‌ పాత్రను విమర్శించే నైతిక హక్కు కాంగ్రె్‌సకు లేదంటూ డాక్టర్‌ కే సుధాకర్‌ విమర్శించారు. ఒకే కుటుంబం నిర్వహణలో ప్రైవేట్‌ కంపెనీలా మారిన కాంగ్రెస్‌ అదృశ్యమయ్యే స్థాయికి చేరుకుంటోందన్నారు. మంత్రి అశ్వత్థనారాయణ ట్వీట్‌ చేస్తూ కాంగ్రె్‌సకు నెహ్రూ కుటుంబమే యూనివర్సిటీ, సోనియానే చాన్స్‌లర్‌, పప్పు, ప్రియాంక ఉపన్యాసకులు, డీకే శివకుమార్‌, సిద్దరామయ్య వంటివారే పరస్పరం తిట్టుకునే విద్యార్థులంటూ పేర్కొన్నారు. హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర ట్వీట్‌ చేస్తూ కాంగ్రె్‌సలో ప్రజాస్వామ్యం భూతద్దం పెట్టి వెతికినా కనబడదన్నారు. సామాజిక న్యాయం అంటే ఆ పార్టీకి గిట్టదన్నారు. ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ ట్వీట్‌ చేస్తూ శతాబ్దాల చరిత్ర ఉందని చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారో ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ ట్వీట్‌ చేస్తూ మునిగిపోతున్న కాంగ్రెస్‌ పరిస్థితి చూసి ఆ పార్టీ నేతలకు మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలవలేని బీఎల్‌ సంతోష్‌ హెడ్డాస్టర్‌లా మంత్రులకు క్లాస్‌ తీసుకోవడం బీజేపీ ప్రభుత్వ తీరు అంటూ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌కు వ్యతిరేకంగా మంత్రులు, బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.