కేబినెట్‌లో ఈ ఇద్దరిలో ఒకరికి YS Jagan ఛాన్స్‌ ఇస్తారా..!?

ABN , First Publish Date - 2022-03-12T06:12:47+05:30 IST

కేబినెట్‌లో ఈ ఇద్దరిలో ఒకరికి YS Jagan ఛాన్స్‌ ఇస్తారా..!?

కేబినెట్‌లో ఈ ఇద్దరిలో ఒకరికి YS Jagan ఛాన్స్‌ ఇస్తారా..!?

  • ఊడేదెవరు? 
  • మంత్రి వర్గంలో బెర్త్‌కు తర్జనభర్జనలు
    అధికార వైసీపీలో ఎవరి వాదన వారిది
    కొత్త జిల్లాల వారీగానే మంత్రుల ఎంపిక
    నాని, వనిత, చెరుకువాడలను తొలగిస్తారా?  
    ఒకరికి మరోసారి ఛాన్స్‌ ఇస్తారా ?



(ఏలూరు–ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఇప్పుడు మంత్రు లుగా కొనసాగుతున్న ముగ్గురికి బదులుగా  మరో ముగ్గురికి అవకాశం కల్పిస్తారా ? లేదంటే వీరిలో ఇద్దరిని తొలగించి ఒకరిని కొనసాగిస్తారా ? ముఖ్యమంత్రి మనసులో మాటేంటి? ఇదీ ఇప్పుడు అధికార వైసీపీలో విస్తృతంగా జరుగుతున్న చర్చ. ఈ నెల మూడో వారంలో జరిగే వైసీపీఎల్పీ సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని.. ఏం జరిగినా అంతా ఆయన ఇష్టమేనంటూ మరికొందరు ఎమ్మెల్యేలు గంపెడాశతో ఉన్నారు.


ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు నుంచి ఎన్నికైన ఆళ్ళ నాని డిప్యూటీ సీఎంగా, కొవ్వూరు నుంచి ఎన్నికైన తానేటి వనిత మహిళా శిశు సంక్షేమ శాఖ  మంత్రిగా, ఆచంట నుంచి ఎన్నికైన చెరుకువాడ శ్రీరంగనాథరాజు గృహ నిర్మా ణ శాఖ మంత్రిగా మంత్రివర్గంలో కొనసాగుతున్నా రు. ఆది నుంచి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న నానికి ఉపముఖ్య మంత్రి పదవి కట్టబెట్టి మంత్రివర్గంలోకి తీసుకున్నా రు. పార్టీ ఆవిర్భావం నుంచి తన పట్ల విధేయత ప్రద ర్శిస్తున్న వారికే సీఎం జగన్‌ ఆదరించి తగినంత అవకా శాలు కల్పిస్తున్నారు. 2019కు ముందు ఎమ్మెల్సీగా కొనసాగు తున్న నాని బదులుగా ఏలూరు నుంచి మధ్యాహ్నపు ఈశ్వరిని రంగం లోకి దించుతారని అప్పట్లో ఊహాగానాలు చెలరేగాయి. వీటికి భిన్నంగా నానికే ఏలూరు సీటు ఇవ్వడమే కాకుండా ఆ తదుపరి గెలిచిన ఆయనకు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. ఇంతకు ముందే జిల్లా అధ్యక్షుడిగా ఆయన పార్టీ బాధ్యతలను నెరవేర్చా రు. ఇప్పుడు మంత్రిగా తొలగించి ఆయనకు పార్టీ పగ్గాలు అప్ప గిస్తారా, లేకుంటే కొన్ని మినహాయింపులు ఇచ్చి సామా జిక వర్గాల వారీగా కాస్తంత దీటుగా నిలబడేలా నానిని కొనసాగి స్తా రా ? అనేది పార్టీలో చర్చ నడుస్తోంది. ఒకవేళ మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారనే దానిపై వాదనలు చోటు చేసుకుంటున్నాయి.


బాలరాజుకు ఛాన్స్‌ దక్కేనా ?

2004 నుంచి 2019 వరకు పోలవరం ఎమ్మెల్యేగా బాలరాజు పలుమార్లు తలపడుతూనే వచ్చారు. నాలుగోసారి ఆయన 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ ఆవిర్భావ సమయంలో కాంగ్రెస్‌ను వీడి జగన్‌ చెయ్యి అందుకున్నారు. దీనికి ప్రతిఫలంగానే ఆయనకు ఈసారి ఎస్టీ జాబితాలో అవ కాశం దక్కబోతుందనే ప్రచారం సాగుతోంది. బాలరాజు సీఎం కు అత్యంత విధేయుడుగా ఉండడంతో ఆయనను ఎస్టీ కమి షన్‌ చైర్మన్‌గా నియమించారు. ఏలూరు జిల్లాలో ఎస్టీ వర్గీయు ల సంఖ్య అత్యల్పమే. ఎస్సీ, బీసీ వర్గీయుల సంఖ్య అత్యధికం. బీసీల నుంచి ఏ ఒక్కరూ ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు.
నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు సైతం పలుమార్లు అదే నియోజకవర్గం నుంచి గెలు పోటములను చవిచూశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవిని ఆశించారు. అది అప్పట్లో సాధ్యం కాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు బాలరాజు, ఇటు అప్పారావు ఇద్దరూ పోటీ పడితే సీఎం ఎవరి వైపు మొగ్గు చూపుతారనేదే ప్రశ్న.


దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మంత్రి పదవి రేసులోనే ఉన్నారు. ఆయన సైతం మొదటి నుంచి సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు. ఈ నేపథ్యంలోనే ఆయన విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు నిర్వహిస్తున్నా అక్కడి నుంచి రప్పించి దెందులూరు సీటు నుంచి పోటీ చేయించారు. ఆ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. అదీ ఇదీ కాదనుకుని కాపు సామాజిక వర్గానికే తిరిగి మంత్రి వర్గంలో చోటు కల్పించాలనుకుంటే ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాస్‌ పేరు పరిగణనలోకి తీసుకోవచ్చు.


డెల్టాలో పరిస్థితేంటి ?


కొత్త జిల్లాల ఏర్పాటులో డెల్టా నియోజక వర్గాలకు సంబం ధించి ఒకింత గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో భీమ వరా న్ని జిల్లా కేంద్రంగా కాకుండా నరసాపురాన్నే కొనసాగిం చాలని సుదీర్ఘ ఆందోళన కొనసాగిస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఏ మాత్రం సానుకూలంగా లేదు. ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తర ణ చాలాకాలం నుంచి ఇక్కడ ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నా యి. ప్రస్తుత ఆచంట ఎమ్మెల్యే, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజును తప్పించి ఆయన స్థానంలో నరసా పురం ఎమ్మెల్యే ముదు నూరి ప్రసాద రాజుకు అవకాశం ఇవ్వడం ఖాయమని ఆది నుంచి పార్టీలో వినిపిస్తూనే ఉంది. మొదటి నుంచి ప్రసాద రాజు వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. సీఎం జగన్‌కు వీర విధేయుడు. జిల్లా కేంద్రం విషయంలో మిగతా వారంతా భీమవరాన్ని వ్యతిరేకిస్తూ నరసాపురం వైపు మొగ్గు చూపుతుం డగా, మంత్రివర్గ విస్తరణను దృష్టిలో పెట్టుకుని ప్రసాదరాజు మౌనంగా ఉంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొ న్నారు. వీటిని పట్టించుకోకుండా సైలెంట్‌గా పార్టీ నిర్ణయానికి కట్టుబడ్డారు. సామాజిక వర్గాల రీత్యా రంగనాథ రాజును తొల గించి ప్రసాద రాజుకే మంత్రి పదవి అప్పగిస్తారా, లేదా అనేది వేచి చూడాలి.



భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆది నుంచి మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఇక్కడి సామాజిక పరిస్థితులను బట్టి ఆయన తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. ఏ అవకాశం వచ్చినా వదులుకోకుండా సీఎం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తు న్నారు. ఈ ప్లస్‌ మార్కులు కలిసొచ్చి గ్రంధికి అవకాశం ఇస్తారా ? లేకుంటే నరసాపురంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రసా దరాజు వైపు మొగ్గు చూపుతారా ? అనేది తేలాల్సి ఉంది. బీసీ కోటాలో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆది నుంచి కాస్తంత ఆశతోనే ఉన్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఒక్కొ జిల్లాకు ఒక్కో మంత్రిని కేటాయించి సరిపెట్టబోతున్నారు.
రాజమ హేంద్రవరం జిల్లాకు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పేరు ఇప్పటికే ప్రస్తావనలో ఉంది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గోపాలపురం నుంచి ఆయన పోటీ చేశారు. ఆర్థికంగా ఏ మాత్రం వెసు లుబాటు లేని వెంకట్రావుకు జగన్‌ అండగా నిలబడి ‘ఎన్నికల పద్దు’ సర్దుబాటు చేశారు. కాస్తంత వివాద రహితుడిగా, పార్టీకి అత్యంత విధేయుడిగా ఉన్న వెంకట్రావు పేరు ఇంతకుముందే కాబోయే మంత్రిగా పార్టీ  ప్రచారంలో ఉంది.

Updated Date - 2022-03-12T06:12:47+05:30 IST