Viral Video: నడీరోడ్డుపై మంత్రి కుమారుడు చేసిన పని నెట్టింట వైరల్

ABN , First Publish Date - 2021-10-24T22:46:08+05:30 IST

సరైన కారణం తెలియదు కానీ కోర్టులో ఉండాల్సిన జడ్జి రోడ్డుపైకి వచ్చారు. పోలీసుల సహాయంతో రోడ్డుపై వెళ్తున్న వాహనాలను తనిఖీ చేశారు. సరిగ్గా అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న మంత్రి కుమారుడి కా

Viral Video: నడీరోడ్డుపై మంత్రి కుమారుడు చేసిన పని నెట్టింట వైరల్

ఇంటర్నెట్ డెస్క్: సరైన కారణం తెలియదు కానీ కోర్టులో ఉండాల్సిన జడ్జి రోడ్డుపైకి వచ్చారు. పోలీసుల సహాయంతో రోడ్డుపై వెళ్తున్న వాహనాలను తనిఖీ చేశారు. సరిగ్గా అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న మంత్రి కుమారుడి కారును కూడా ఆ న్యాయమూర్తి చెక్ చేశారు. ఈ క్రమంలో సరదు మంత్రి కుమారుడు చేసిన పనిని కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. కాగా.. ఇందకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 



మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఉన్న కోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా జడ్జి అక్టోబర్ 23న కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల సహాయంతో రోడ్డుపై వెళ్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే ఆమె.. మధ్యప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ అండ్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ కుమారుడైన ఆకాశ్ రాజ్‌పుత్ కారును అడ్డుకున్నారు. అనంతరం కారుకు సంబంధించిన పేపర్లను ఆమె పరిశీలించారు. పేపర్లు అన్నీ సరిగ్గా ఉండటంతో ఆ న్యాయమూర్తి.. ఆకాశ్ రాజ్‌పుత్‌‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆకాశ్ రాజ్‌పుత్ తన రెండు చేతులను జోడించి వంగి మరీ.. ఆ మహిళా న్యాయమూర్తికి నమస్కారం చెప్పాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. 





Updated Date - 2021-10-24T22:46:08+05:30 IST