కేబినెట్ భేటీ తర్వాత రాజీనామా చేయనున్న మంత్రులు

ABN , First Publish Date - 2022-04-07T20:58:26+05:30 IST

దాదాపు మూడేళ్లుగా కొనసాగుతున్న ‘మంత్రివర్గం’ ముచ్చట ముగిసిపోనుంది. గురువారం జరిగే కేబినెట్‌ సమావేశమే....

కేబినెట్ భేటీ తర్వాత రాజీనామా చేయనున్న మంత్రులు

అమరావతి: దాదాపు మూడేళ్లుగా కొనసాగుతున్న ‘మంత్రివర్గం’ ముచ్చట ముగిసిపోనుంది. గురువారం జరిగే కేబినెట్‌ సమావేశమే.... ప్రస్తుత మంత్రులకు ఆఖరి భేటీ కానుంది. అందువల్ల ఈ రోజు జరగుతున్న ఏపీ కేబినెట్ చాలా కీలకమైనది. ఈ కేబినెట్ భేటీ ప్రస్తుత మంత్రులు మాజీలవుతారు. కొత్త మంత్రులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అందుకే ఈ భేటీ అంత్యంత ప్రదాన్యత సంతరించుకుంది. కొద్దిసేపటి క్రితం ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు రాజీనామా చేయనున్నారు. ఈనెల 11న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజీనామా చేసిన మంత్రులకు కేబినెట్ ర్యాంక్ ఇస్తారు. జిల్లా అభివృద్ధి మండలి తరహాలో రాజీనామా చేసిన మంత్రులకు పదవులు ఇస్తారు. 



ఈ కేబినెట్ సమావేశంలో ‘కాబోయే మాజీ’లకు కర్తవ్య బోధ కూడా చేస్తారని.. 2024 ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాలు, సామాజిక సమీకరణల కోణాలను వివరిస్తారని వైసీపీ ముఖ్యనేతలు చెబుతున్నా రు. రాజీనామాలు ఇచ్చేసిన తర్వాత... కేబినెట్‌ భేటీకి  హాజరైనవారు అధికారిక వాహనాల్లో తిరుగుముఖం పడతారా, లేక సొంత వాహనా ల్లో వెనుదిరుగుతారా అనేది గమనిస్తే చాలని .. లోపల ఏం జరిగిందో తెలిసిపోతుందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందరి రాజీనామాలను ఆమోదించేసి.. తిరిగి ఈనెల 11న ఆదిమూలపు సురేశ్‌, సీదిరి అప్పలరాజు,  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాంలను మళ్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని అధికార పార్టీ  పేర్కొంటున్నాయి.

Updated Date - 2022-04-07T20:58:26+05:30 IST