Kuwait: ప్రవాసులకు బ్యాడ్‌న్యూస్.. వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేసిన కువైత్!

ABN , First Publish Date - 2022-09-18T13:50:59+05:30 IST

ఇప్పటికే ప్రవాసుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న గల్ఫ్ దేశం కువైత్ (Kuwait).. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Kuwait: ప్రవాసులకు బ్యాడ్‌న్యూస్.. వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేసిన కువైత్!

కువైత్ సిటీ: ఇప్పటికే ప్రవాసుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న గల్ఫ్ దేశం కువైత్ (Kuwait).. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వలసదారులకు వర్క్ పర్మిట్ వీసాల (Work permit visa) జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) ప్రకటన విడుదల చేసింది. కాగా, ఈ నిర్ణయం కొన్ని దేశాల జాతీయులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. అయితే, ఆ దేశాల జాబితాను మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. 


కువైత్ సర్కార్ కొత్త వీసా విధానానికి సంబంధించిన ప్రక్రియను చేపడుతున్న ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. కొత్త ప్రక్రియలోని ప్రాసెస్‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరిగేందుకు వర్క్ పర్మిట్ వీసాల జారీని నిలిపివేసింది. కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు వర్క్ పర్మిట్ వీసాల జారీ జరగదని సంబంధిత అధికారులు తెలిపారు.  కొన్ని వారాల్లో ఈ ప్రక్రియకు సంబంధించిన కొత్త విధి విధానాలను అమల్లోకి తేవడం జరుగుతుందని ఈ సందర్భంగా అంతర్గత మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఇక కొన్ని వారాల క్రితమే ఫ్యామిలీ విజిట్ వీసాలతో పాటు ఫ్యామిలీ వీసాల (Family visa) జారీని నిలిపివేస్తున్నట్లు కువైత్ ప్రకటించిన విషయం తెలిసిందే.  

Updated Date - 2022-09-18T13:50:59+05:30 IST