జ్ఞాపకశక్తిలో మిన్న!

ABN , First Publish Date - 2021-01-03T05:30:00+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన మొదలి షణ్ముఖ అగస్త్య వయస్సు ఐదేళ్లు. కానీ వయసుకు మించిన

జ్ఞాపకశక్తిలో మిన్న!

ఈ ఐదేళ్ల బుడతడు అడిగిందే తడవుగా దేశాల రాజధానుల పేర్లు గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తాడు. తన ప్రతిభతో ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు’ల్లోకి ఎక్కిన ఈ చిన్నారి విశేషాలివి...


హైదరాబాద్‌కు చెందిన మొదలి షణ్ముఖ అగస్త్య వయస్సు ఐదేళ్లు. కానీ వయసుకు మించిన జ్ఞాపకశక్తితో అబ్బురపరుస్తాడు. 


50 ఆసియా దేశాల రాజధానులు, 54 ఆఫ్రికా దేశాల రాజధానుల పేర్లు, యూరోపియన్‌ దేశాల రాజధానుల పేర్లు, ఉత్తర అమెరికాలోని వివిధ దేశాల రాజధానుల పేర్లను గడగడా చెప్పేస్తాడు. 


ప్రపంచ పటం ముందు పెడితే దేశాలు, వాటి రాజధానులను గుర్తిస్తాడు. ఇదొక్కటే కాదు చూడచక్కగా బొమ్మలు కూడా గీయగలడు. 


Updated Date - 2021-01-03T05:30:00+05:30 IST