మరోసారి విలన్‌గా.. ‘మిన్నల్‌ మురళి’ నటుడు

Published: Sat, 22 Jan 2022 22:06:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మరోసారి విలన్‌గా.. మిన్నల్‌ మురళి నటుడు

తమిళ చిత్రపరిశ్రమలో అత్యంత ప్రతిభావంతుడైన నటుడుగా గుర్తింపు పొందిన గురు సోమసుందరం తొలిసారి పూర్తి స్థాయి విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు డైలాగ్‌ డెలివరీలో ప్రత్యేకశైలి ఉంది. ఇటీవల విడుదలైన ‘మిన్నల్‌ మురళి’ చిత్రంలోనూ ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటివరకు ఎన్నో విభిన్న పాత్రలను పోషించిన గురు సోమసుందరం.. తన కెరీర్‌లో పూర్తి స్థాయి ప్రతినాయకుడి పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్‌.వెంకట్‌ స్ర్కీన్‌ప్లే సమకూర్చి దర్శకత్వం వహించిన ‘‘బెల్‌’’ అనే చిత్రంలో ఆయన విలన్‌గా నటించారు. బ్రోగన్‌ మూవీస్‌ బ్యానరులో నిర్మించిన ఈ చిత్ర షూటింగ్‌ ఏర్కాడు తదితర ప్రాంతాల్లో 60 రోజుల పాటు జరుపుకుంది. 


ఈ చిత్ర కథ గురించి దర్శకుడు వెంకట్‌ భువన్‌ వివరిస్తూ.. ఒక రాజవంశంలో ఆఖరి వాడైన గ్రహం బెల్‌ వంశపారంపర్యంగా ఉన్న రహస్యం గురించి ఎవరికీ తెలియకుండా దాస్తాడు. అయితే, బెల్‌ తన జీవితంలో తారసపడే వారిని ఏ విధంగా గుర్తుపడతాడు అన్నదే ఈ చిత్ర స్ర్కీన్‌ప్లే. దీన్ని అద్భుతంగా తెరకెక్కించాం. నటుడు గురు సోమసుందరం ఈ చిత్రంలో తొలిసారి బ్రహ్మ అనే విలన్‌ పాత్రను పోషించారు. గురుతో పాటు నితీస్‌ వీరా, శ్రీధర్‌ తదితరులు నటించారు. పీటర్‌ చక్రవర్తి సాహిత్యానికి రాబర్ట్‌ సంగతం సమకూర్చారు. పీటర్‌ చక్రవర్తి, డేవిడ్‌ నలచక్రవర్తి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. 

TAGS: kollywood
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International