స్నేహితుడే కదా అని ఇంటికి రానిచ్చేవాడు.. అతను చేసిన నమ్మక ద్రోహం ఏంటో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-05-04T18:26:13+05:30 IST

అతను ఓ నగల వ్యాపారి.. అతనికి పదమూడేళ్ల కూతురు ఉంది.. ఆ బాలిక దివ్యాంగురాలు కావడంతో ఇంటి దగ్గరే ఉండేది..

స్నేహితుడే కదా అని ఇంటికి రానిచ్చేవాడు.. అతను చేసిన నమ్మక ద్రోహం ఏంటో తెలిస్తే షాక్!

అతను ఓ నగల వ్యాపారి.. అతనికి పదమూడేళ్ల కూతురు ఉంది.. ఆ బాలిక దివ్యాంగురాలు కావడంతో ఇంటి దగ్గరే ఉండేది.. కొద్ది రోజుల కిందట ఆ బాలికకు తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది.. దగ్గర్లోని క్లినిక్‌కు తీసుకెళ్లగా ఏవో మందులు రాసిచ్చారు.. అయినా కడుపునొప్పి తగ్గకపోవడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆ బాలిక ఐదో నెల గర్భవతి అని తేల్చారు.. తన స్నేహితుడే తన కూతురిని గర్భవతిని చేశాడని తెలుసుకుని నగల వ్యాపారి దిగ్భ్రాంతి చెందాడు. 


రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న నగల వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. `అతను నా జ్యువెలరీ షాప్‌‌నకు తరచుగా వచ్చేవాడు. స్నేహితుడు కదా అని నేను ఇంటికి కూడా తీసుకెళ్లాను. గత ఐదు నెలలుగా ప్రతి వారం మా ఇంటికి వచ్చి నా కూతురితో మాట్లాడుతున్నాడు. ఇంత పని చేస్తాడని నేను ఊహించలేద`ని ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


తాను ఒంటరిగా ఉన్నప్పుడు ఒకసారి ఆ అంకుల్ ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడని ఆ బాలిక పోలీసులకు చెప్పింది. ఆ తర్వాత పలుసార్లు కూడా తనపై అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.  


Read more