అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో నిద్రలేచిన తల్లి.. గదిలో కనిపించని కూతురు.. అసలు నిజం తెలిసి..

ABN , First Publish Date - 2021-11-20T01:53:09+05:30 IST

ఎప్పటిలాగే నవంబర్ 17న కూడా కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ఎవరి గదుల్లో వారు పడుకున్నారు. ఈ క్రమంలో అర్థరాత్రి ఒంటిగంటకు అకస్మాత్తుగా తల్లి నిద్రలోంచి మేలుకుంది. దీంతో నీళ్లు తాగేందకు గది నుంచి బయటకు వ

అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో నిద్రలేచిన తల్లి.. గదిలో కనిపించని కూతురు.. అసలు నిజం తెలిసి..

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగే నవంబర్ 17న కూడా కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ఎవరి గదుల్లో వారు పడుకున్నారు. ఈ క్రమంలో అర్థరాత్రి ఒంటిగంటకు అకస్మాత్తుగా తల్లి నిద్రలోంచి మేలుకుంది. దీంతో నీళ్లు తాగేందకు గది నుంచి బయటకు వచ్చిన ఆమె.. కూతురు గదివైపు చూసింది. గదిలోని బెడ్‌పై కూతురు కనపడకపోవడంతో ఆమె కంగారు పడింది. మొదట గదిలో వెతికి.. ఆ తర్వాత ఇల్లంతా వెతికింది. అనంతరం విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి, వారి సహాయంతో చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పట్టింది. ఆ తర్వాత అసలు విషయం గ్రహించి షాకయింది. అసలేం జరిగింది అంటే..


రాజస్థాన్‌లోని బన్స్వారా ప్రాంతానికి చెందిన దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో వారు అమ్మాయికి జన్మనిచ్చారు. ప్రస్తుతం ఆమెకు 18ఏళ్లు కూడా లేవు. కాగా.. ఎప్పటిలాగే ఆ కుటుంబ సభ్యులు అందరూ కలిసి.. ఈ నెల 17 కూడా రాత్రి భోజనం చేసి, ఎవరి గదుల్లో వాళ్లు పడుకున్నారు. అర్థరాత్రి ఒంటి గంటకు.. అకస్మాత్తుగా భార్యకు మెలకువ వచ్చి, నీళ్లు తాగేందకు బయటికి వచ్చింది. నీళ్లు తాగేందుకని గదిలోంచి బయటికొచ్చి.. కూతురు గదివైపు చూసి ఒక్కసారిగా షాకైంది. గదిలో కూతురు కనిపించకపోవడంతో కంగుతింది.



అనంతరం విషయాన్ని తన భర్తకు చెప్పి, చుట్టుపక్కల గాలించింది. అయినప్పటికీ కూతురి జాడ తెలియకపోవడంతో.. అసలు విషయానని ఆ దంపతులు గ్రహించారు. తమ కూతురు మళ్లీ.. దివ్యాంగ కుర్రాడితో పారిపోయినట్టు గుర్తించి.. షాకయ్యారు. అనంతరం మరుసటి రోజు ఉడయం సదరు అమ్మాయి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. కేషియా అనే కుర్రాడు తన కూతురితో పారిపోయాడని ఫిర్యాదు ఇచ్చాడు. 20రోజుల క్రితం ఇలాగే జరిగితే.. ఊళ్లోని పెద్దలు సమస్యను పరిష్కరించి తమ కూతురుని తమకు అప్పగించారని వెల్లడించాడు. అయితే అతడు మళ్లీ తన కూతురిని ఇంట్లోంచి తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2021-11-20T01:53:09+05:30 IST