16 ఏళ్ల బాలిక అదృశ్యం కేసులో ప్రియుడిపై అనుమానం.. అసలు హంతకుడెవరో తెలిసి పోలీసులకే షాక్!

ABN , First Publish Date - 2022-02-20T05:41:20+05:30 IST

ఒక 16 ఏళ్ల బాలిక కనబడడం లేదంటూ.. ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక ఒక వేరే కులం యువకుడిని ప్రేమిస్తోందని.. ఆమె ప్రేమికుడిపై బాలిక సోదరుడు అనుమానం వ్యక్తం చేశాడు...

16 ఏళ్ల బాలిక అదృశ్యం కేసులో ప్రియుడిపై అనుమానం.. అసలు హంతకుడెవరో తెలిసి పోలీసులకే షాక్!

ఒక 16 ఏళ్ల బాలిక కనబడడం లేదంటూ.. ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక ఒక వేరే కులం యువకుడిని ప్రేమిస్తోందని.. ఆమె ప్రేమికుడిపై బాలిక సోదరుడు అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు బాలిక ప్రియుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఆ తరువాత విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.


వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ పట్టణంలోని నివసించే చందన(16, పేరు మార్చబడినది) అనే బాలిక కనబడడం లేదంటూ ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చందన ప్రేమించిన యువకుడే ఆమెను కిడ్నాప్ చేసి ఉంటాడని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. చందన మిస్సింగ్ కేసులో పోలీసులు ఆమె ప్రియుడు శంకర్(పేరు మార్చబడినది)ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. మరుసటి రోజే పోలీసులకు ఊరి చివర చందన శవం లభించింది. శంకర్ చెప్పిన విషయాలపై పోలీసులు దర్యాప్తు చేశారు. అప్పుడు చందన హంతకుడి గురించి పోలీసులు తెలిసుకొని నిర్ఘాంతపోయారు.



పోలీసుల కథనం ప్రకారం చందన ఒక వేరే కులం యువకుడిని ప్రమించింది. ఈ విషయం చందన తల్లి లచ్చమ్మకు ఇష్టంలేదు. ఆ యువకుడికి దూరంగా ఉండమని లచ్చమ్మ ఎంతచెప్పినా చందన వినలేదు. దీంతో ఒకరోజు చందన తల్లి ఆమెను ఊరి చివరకు తీసుకుపోయింది. అక్కడ లచ్చమ్మ ప్రియుడు నరసింహులు వారికోసం ఎదరు చూస్తున్నాడు. లచ్చమ్మ, నరసింహులు కలిసి చందనను హత్య చేసి.. చెట్ల మాటున శవాన్ని వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు ముందుగా చందన ప్రేమించిన యువకుడిని అరెస్టు చేయగా,. అతను లచ్చమ్మపై అనుమానం వ్యక్తం చేశాడు. 


పోలీసులు లచ్చమ్మను అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నించారు. అప్పుడు లచ్చమ్మ.. పరువు కాపాడుకునేందుకు తనే తన కన్నకూతురిని హత్యచేశానని అంగీకరించింది. వేరే కులం యువకుడిని ప్రేమించినందకు చందనను కడతేర్చానని చెప్పింది.


Updated Date - 2022-02-20T05:41:20+05:30 IST