ltrScrptTheme3

Kochi: ఆసుపత్రి టాయిలెట్‌లో బాలిక ప్రసవం

Sep 4 2021 @ 12:33PM

కొచ్చి (కేరళ): అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ బాలిక ఆసుపత్రి టాయిలెట్ లో ప్రసవించిన ఘటన కేరళ రాష్ట్రంలోని కొచ్చి నగరంలో వెలుగుచూసింది. ఓ బాలికపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది. దీంతో తల్లి తన కుమార్తెను తీసుకొని కొచ్చిలోని ఓ ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రికి వచ్చిన బాలిక బాత్రూంలోకి వెళ్లి అక్కడే ప్రసవించింది. అనంతరం పిండాన్ని టాయిలెట్ లో నెట్టి నీటిని ఫ్లష్ చేసింది. మరో వ్యక్తి టాయిలెట్ లో పిండం అవశేషాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో బాలిక తాను అకాల శిశువుకు జన్మనిచ్చి పిండాన్ని టాయిలెట్ లో పడేశానని అంగీకరించింది. బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టం కింద అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కొచ్చికి తీసుకువచ్చామని పోలీసులు చెప్పారు. 


Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.