మైనారిటీ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-11-28T04:01:06+05:30 IST

నేషనల్‌ మైనారిటీ స్కాలర్‌షిప్‌ దరఖాస్తులను త్వరితగతిన న మోదు చేసుకోవాలని జిల్లా మైనారిటీ వెల్ఫేర్‌ అధికారి ఝాన్సీరాణి తెలిపారు.

మైనారిటీ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి
విద్యార్థినులతో మాట్లాడుతున్న అధికారి ఝాన్సీరాణి

కంభం, నవంబరు 27 : నేషనల్‌ మైనారిటీ స్కాలర్‌షిప్‌ దరఖాస్తులను త్వరితగతిన న మోదు చేసుకోవాలని జిల్లా మైనారిటీ వెల్ఫేర్‌ అధికారి ఝాన్సీరాణి తెలిపారు. శనివారం మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆల్ఫా స్కూలు, వాసవీ విద్యానికేతన్‌, అర్బన్‌కాలనీ  ఉర్దూ తదతర పాఠశాలలను ఆమె సందర్శించారు.     ఈ సందర్భంగా మైనారిటీ ఉపకార వేతనాలపై విద్యార్థులకు ఝాన్సీరాణి అవగాహన క ల్పించారు. ఈనెల 30వ తేదీలోపు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో అర్హులైన విద్యార్థుల పేర్లను నమోదు చేయాలన్నారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నమోదు ప్ర క్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూ చించారు. స్కాలర్‌షిప్‌లు అందేలా కృషి చేయడం ద్వారా  వారి విద్యా ఉన్నతికి ఉప యోగపడుతుందన్నారు. కంభం జూనియర్‌ కళాశాలలో 150 మంది మైనారిటీ విద్యార్థులున్నా  ఏ ఒక్కరూ స్కాలర్‌షిప్‌ కోసం దరఖా స్తు చేసుకోకపోవడంపై  ఝాన్సీరాణి అసం తృప్తి వ్యక్తం చేశారు. స్కాలర్‌షిప్‌లు ఎలా పొందాలో అన్న దానిపై హెచ్‌ఎంలకు అవ గా హన కల్పించారు.  దరఖాస్తు చేయవలసిన వారు ఈనెల 30లోపు జిల్లా మైనారిటీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమం లో  ఉ ర్దూ డీఐ షేక్‌ హబీబుల్లా, అర్బన్‌కాలనీ ఉర్దూ పాఠశాల హెచ్‌ఎం గౌస్‌ఖాన్‌, అల్తాఫ్‌హుస్సేన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-28T04:01:06+05:30 IST