మినుముపై తెగుళ్లతో అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-01-29T06:42:38+05:30 IST

మినుముపై తెగుళ్లతో అప్రమత్తంగా ఉండాలి

మినుముపై తెగుళ్లతో అప్రమత్తంగా ఉండాలి
మినుము పంటను పరిశీలిస్తున్న ఏవో కిరణ్‌కుమార్‌

కంకిపాడు, జనవరి 28 : మినుము రైతులు పల్లాకు, బూడిద తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉం డాలని ఏవో కిరణ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో మినుము పంట ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లా డుతూ మండలంలోని వివిధ గ్రామాల్లో 6,078 ఎకరాల్లో మినుము పంటను రైతులు సాగు చేస్తు న్నారని, మినుము పంటలో అత్యధికంగా బూడిద, తుప్పు తెగుళ్లు కనిపిస్తున్నాయన్నారు. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలుగా కనబడి అవి క్రమేణా పెద్దవై ఆకుల పైన క్రింద భాగాలకు, కొమ్మ లకు కాయలకు  వ్యాపిస్తాయన్నారు. వీటి నివారణకు నీటిలో ఒక గ్రాము కార్పెండజిమ్‌ లేదా ఒక గ్రాము థయోఫానేట్‌ మిథైల్‌ లేదా ఒక మిల్లీ లిటర్‌ హెక్సాకొనజోల్‌ కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని  సూచించారు. అదే విధంగా తుప్పు తెగులు నివారణకు లీటరు నీటిలో 3 గ్రాములు మాంకోజెబ్‌, ఒక మిల్లీ గ్రాము డైనకాప్‌ లేక ఒక మిల్లీ గ్రాము ట్రైడిమార్ప్‌ లేక ఒక గ్రాము బైలాథాన్‌ లీటర్‌ నీటిలో కలిపి పిచికారి చేయాలని రైతులకు సూచించారు.  మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో రాయితీపై వేపనూనె అందుబాటులో ఉందని ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T06:42:38+05:30 IST