లాభాల ఘాటు

ABN , First Publish Date - 2021-04-24T05:11:53+05:30 IST

ఏజెన్సీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వర్షాలు, వరదల కారణంగా రైతులు సాగు చేసిన ధాన్యం అపరాల పంటల దిగుబడుల్లో తగ్గుదల లోపించినప్పటికీ మిర్చి రైతులకు మాత్రం కొంత కలిసి వచ్చిందనే చెప్పవచ్చు.

లాభాల ఘాటు

ఆశాజనకంగా దిగుబడులు.. రైతుల కళ్లల్లో ఆనందం

క్వింటా మిర్చి ధర రూ.12 వేల నుంచి రూ.15 వేలు

కుక్కునూరు/వేలేరుపాడు, ఏప్రిల్‌ 23 : ఏజెన్సీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వర్షాలు, వరదల కారణంగా రైతులు సాగు చేసిన ధాన్యం అపరాల పంటల దిగుబడుల్లో తగ్గుదల లోపించినప్పటికీ మిర్చి రైతులకు మాత్రం కొంత కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. వాతావరణం అనుకూలించడం, దిగుబడులు ఆశాజన కంగా ఉండటంతోపాటు మిర్చి ధరలు నిలకడగా ఉండటంతో లాభా లు బాటపట్టారు. గోదావరి వరదల తగ్గిన అనంతరం రెండు మండలాల్లో దాదాపు ఐదు వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. చీడపీడలు అధికంగా ఉన్నప్పటికీ తగిన నివారణ చర్యలు చేపట్టడంతో ఎకరానికి 20 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సన్నరకం రూ.13 వేల నుంచి రూ.15 వేలు, లావు రకం రూ.12 వేల నుంచి రూ.14 వేలు ధర పలుకుతోంది. కూలీల కొరతతో ఖర్చు కొంత అధికంగా అయినప్పటికీ రైతులు ఈ ఏడాది పెట్టుబడులు పోను ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.లక్షకు పైగా లాభాలను ఆర్జించారు. ఇదే సమయంలో వచ్చే వ్యవసాయ సీజన్‌కు భూముల కౌలు ధరలు అమాంతంగా పెరిగాయి. కుక్కునూరుతో పాటు పలు గ్రామాల్లో ఎకరం కౌలు ధర రూ.30 వేలు ఉండగామండలంలోని దామరచర్ల భూములకు మాత్రం ఎకరంకు రూ.40 వేలకు పైగాకౌలు ధర ఉంది. గతకొన్నేళ్లుగా నష్టాలను చవిచూసిన మిర్చి రైతు ఈ ఏడాది ఆశించిన దిగుబడి, మద్దతు ధర కూడా ఉండటంతో కొంతమేరకు లాభాలను ఆర్జించారు.

Updated Date - 2021-04-24T05:11:53+05:30 IST