మిసల్‌ పావ్‌

ABN , First Publish Date - 2021-09-13T21:39:38+05:30 IST

ఉల్లిముక్కలు- కప్పు, టమోటా ముక్కలు- కప్పు, ఎండుకొబ్బరి- పావు కప్పు, ధనియాలు- రెండు స్పూన్లు, జీలకర్ర- రెండు స్పూన్లు, లవంగాలు- మూడు, ఎండు మిర్చి- రెండు, వెల్లుల్లి రెబ్బలు- మూడు, పసుపు- పావు స్పూను, మొలకెత్తిన బఠానీలు,

మిసల్‌ పావ్‌

కావలసిన పదార్థాలు: ఉల్లిముక్కలు- కప్పు, టమోటా ముక్కలు- కప్పు, ఎండుకొబ్బరి- పావు కప్పు, ధనియాలు- రెండు స్పూన్లు, జీలకర్ర- రెండు స్పూన్లు, లవంగాలు- మూడు, ఎండు మిర్చి- రెండు, వెల్లుల్లి రెబ్బలు- మూడు, పసుపు- పావు స్పూను, మొలకెత్తిన బఠానీలు, పెసర్లు, బొబ్బర్లు- రెండు కప్పులు, కారం- ఒకటిన్నర స్పూను, కొత్తిమీర తురుము - అరకప్పు, ఆలుగడ్డలు- రెండు, నిమ్మరసం- స్పూను.


తయారుచేసే విధానం: పాన్‌లో నూనె, ఉల్లి, కొబ్బరివేసి వేయించాలి. రెండు నిమిషాల తరవాత మసాలా దినుసులు వేయాలి. దోరగా వేగాక స్టవ్‌ కట్టేసి పూర్తిగా చల్లారాక మిక్సీలో పొడిచేసి మసాలా పెట్టుకోవాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో నూనె కాగాక జీలకర్ర చిటపటలాడించి ఉల్లి ముక్కలు వేసి దోరగా వేయించాలి. టమోటా ముక్కలు, పసుపు వేసి కాస్త నీళ్లు వేసి మూడు నిమిషాల తరవాత మొలకెత్తిన గింజలు, ఉప్పు, రెండు కప్పుల నీటిని పోసి మూతపెట్టాలి. మూడు విజిల్స్‌ తరవాత మంట తీసెయ్యాలి. చల్లారాక కారప్పొడి, అర కప్పు నీళ్లు పోసి కలుపుతూ మరో మూడు నిమిషాలు ఉడికిస్తే మిసెల్‌ పావ్‌ రెడీ. పావ్‌లతో తినడానికి ఇది బాగుంటుంది. వడ్డించేప్పుడు కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండితే సరి.

Updated Date - 2021-09-13T21:39:38+05:30 IST