రోడ్డుపై అమ్మాయిని వేధించిన ఆకతాయిలు.. అడ్డుకున్న తల్లిని వారేంచేశారంటే..

ABN , First Publish Date - 2021-11-24T13:02:05+05:30 IST

రోజూ లాగే ఆ తల్లి తన కూతురితో కలిసి పనికి బయలుదేరింది. అనుకోకుండా రోడ్డుపై ఒక కారులో వచ్చిన కొందరు ఆకతాయిలు ఆ కూతురితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇదంతో చూసిన ఆ తల్లి వారిని ఎదురించింది. ఆకతాయిలు మరింత రెచ్చిపోయి ఆమెను కొట్టారు. అంతటితో ఆగక ఆమెపై కారును ఎక్కించి చంపేశారు...

రోడ్డుపై అమ్మాయిని వేధించిన ఆకతాయిలు.. అడ్డుకున్న తల్లిని వారేంచేశారంటే..

రోజూ లాగే ఆ తల్లి తన కూతురితో కలిసి పనికి బయలుదేరింది. అనుకోకుండా రోడ్డుపై ఒక కారులో వచ్చిన కొందరు ఆకతాయిలు ఆ కూతురితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇదంతో చూసిన ఆ తల్లి వారిని ఎదురించింది. ఆకతాయిలు మరింత రెచ్చిపోయి ఆమెను కొట్టారు. అంతటితో ఆగక ఆమెపై కారును ఎక్కించి చంపేశారు. ఈ ఘటన పట్ట పగటు పంజాబ్ రాజధాని చండీగఢ్‌లో పట్టపగలు జరిగింది.


చండీగఢ్‌లో నివసించే నిమ్రా కౌర్(35) తన కూతురు పమ్మీ(16)తో కలిసి దానా మండీలో పని వెళ్లేది. శనివారం నిమ్రా, పమ్మీ రోజూ లాగే పనికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై కొందరు ఆకతాయిలు పమ్మీని అల్లరి చేశారు. వారిని నిమ్రా తరిమి కొట్టింది. కానీ మళ్లీ ఆదివారం కూడా అలాగే పనికి వెళ్తున్నప్పుడు అదే ఆకతాయిలు ఒక బొలేరో కారులో వచ్చారు. ఈ సారి పమ్మీని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. కానీ నిమ్రా వారిని అడ్డుకొంది. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆ ఆకతాయిలు మరింత రెచ్చిపోయారు.


ఆకతాయిలలో ఒకడు బొలేరో నడుపుతున్నాడు. అతను నిమ్రాను కారుతో ఢీకొట్టాడు. ఆ తరువాత ఆమెపై నుంచి కారుని పోనిచ్చాడు. దీంతో నిమ్రా అక్కడికక్కడే చనిపోయింది. ఆ తరువాత ఆకతాయిలు వెంటనే కారు ఎక్కి పారిపోయారు. ఈ దృశ్యమంతా సమీపంలోని సీసీటీవిలో రికార్డ్ అయింది. 


నిమ్రా మరణాన్ని విచారణ చేస్తున్న పోలీసులు ఆమె భర్తను ప్రశ్నించారు. అతను ఇంతకు ముందు రోజు జరిగిన విషయం తనతో నిమ్రా చెప్పిందని అన్నాడు. ఆ ఆకతాయిలెవరో తనకు తెలియదని చెప్పాడు. గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి సీసీటీవి వీడియోలో ఉన్న బొలేరో కారు నెంబరు ఆధారంగా ఆకతాయిల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-11-24T13:02:05+05:30 IST