మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌ ఖుషీ పటేల్‌

Published: Sun, 26 Jun 2022 02:35:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌ ఖుషీ పటేల్‌

వాషింగ్టన్‌, జూన్‌ 25 : మూడేళ్ల తర్వాత జరిగిన మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌-2022 పోటీల్లో బ్రిటన్‌ విద్యార్థిని ఖుషీ పటేల్‌ విజేతగా నిలిచారు.  వైదేహి డోంగ్రే తొలి రన్నరప్‌, శ్రుతిక మానె రెండో రన్నర్‌పగా నిలిచారు. ఈ పోటీల్లో పాల్గొన్న 12 మంది ప్రపంచవ్యాప్తంగా వివిధ పోటీల్లో గెలిచినవారే. ఖుషీ పటేల్‌ బ్రిటన్‌లో బయోమెడికల్‌ సైన్సెస్‌ చదువుతున్నారు. కాగా, మిస్‌ టీన్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌-2022 కిరీటాన్ని గయానాకు చెందిన రోషణి రజాక్‌ సాధించారు. నవ్య పైంగోల్‌(అమెరికా), చికిత మలాహ(సురినామ్‌) తర్వాత స్థానాల్లో నిలిచారని ఇండియా ఫెస్టివల్‌ కమిటీ తెలిపింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.