మిస్ యూనివర్స్ Harnaaz Sandhu కు.. ప్రైజ్ మనీ మాత్రమే కాకుండా ఆమెకు ఇంకా ఏమేం ఇస్తారంటే..

ABN , First Publish Date - 2021-12-22T07:40:26+05:30 IST

ఇటీవల మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని గెలుచుకున్న పంజాబీ బ్యూటీ హర్నాజ్ సంధుపైనే ఇప్పుడు అందరి కళ్లున్నాయి. ఇజ్రాయెల్‌లో జరిగిన మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో విజేతగా నిలిచిన 21 ఏళ్ల హర్నాజ్‌కు..

మిస్ యూనివర్స్ Harnaaz Sandhu కు.. ప్రైజ్ మనీ మాత్రమే కాకుండా ఆమెకు ఇంకా ఏమేం ఇస్తారంటే..

ఇటీవల మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని గెలుచుకున్న పంజాబీ బ్యూటీ హర్నాజ్ సంధుపైనే ఇప్పుడు అందరి కళ్లున్నాయి.  ఇజ్రాయెల్‌లో జరిగిన మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో విజేతగా నిలిచిన 21 ఏళ్ల హర్నాజ్‌కు కిరీటంతో పాటు కొన్ని బహుమతులు లభిస్తాయి. 


ప్రపంచ దేశాల ఎన్నో సుందరాంగులను కాదని మిస్ యూనివర్స్ పోటీలో గెలిచిన హర్నాజ్‌కు ముందుగా ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన కిరీటం బహుమతిగా లభిస్తుంది. ఈ కిరీటం విలువ దాదాపు రూ.37 కో్ట్లు. 


ఇది కాకుండా ఆమెకు ప్రైజ్ మనీ కింద లక్షల రూపాయలు, ఖరీదైన వసతుల లభిస్తాయి. మిస్ యూనివర్స్‌గా హర్నాజ్‌ ఒక సంవత్సరం వరకు కొనసాగుతుంది. అప్పటివరకు ఆమె అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉండేందుకు ఒక విలాసవంతమైన భవనం ఇవ్వబడుతుంది. అలాగే ఆమెకు కావాల్సిన రోజువారీ సామాన్లు, సరుకులు, మేకప్ అన్నీ మిస్ యూనివర్స్ యాజమాన్యం ఉచితంగా సరఫరా చేస్తుంది. 


మిస్ యూనివర్స్‌గా గెలిచిన మన పంజాబీ బ్యూటీకోసం ఫ్యాషన్ స్టైలిస్టులు కూడా ఒక సంవత్సరం వరకు ఉచితంగా సేవలందిస్తారు. ఆమెకు అయ్యే ఆస్పత్రి ఖర్చులు కూడా మిస్ యూనివర్స్ యాజమాన్యం భరిస్తుంది.


వీటితో పాలు అమెరికాలో జరిగే పార్టీలు, ఫ్యాషన్ అవార్డులు, సినిమా ప్రీమియర్లకు, ఉచితంగా ఎంట్రీ లభిస్తుంది. అలాగే ప్రపంచమంతా ఎక్కడికి ప్రయాణించాలన్నా, ఏ హోటల్‌లో బసచేయాలన్నా ఏడాదిపాటు ఆమెకు అన్నీ ఉచితమే.

Updated Date - 2021-12-22T07:40:26+05:30 IST