Miss India మానస వారణాసికి కరోనా...మిస్ వరల్డ్ పోటీలు వాయిదా

ABN , First Publish Date - 2021-12-17T15:46:36+05:30 IST

మిస్ ఇండియా 2020 మానస వారణాసికి కూడా కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది....

Miss India మానస వారణాసికి కరోనా...మిస్ వరల్డ్ పోటీలు వాయిదా

న్యూఢిల్లీ: మిస్ ఇండియా 2020 మానస వారణాసికి కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. భారతదేశానికి చెందిన మానస వారణాసితో సహా పలువురు పోటీదారులు కొవిడ్-19 పాజిటివ్ బారిన పడటంతో మిస్ వరల్డ్ 2021 పోటీలు వాయిదా పడ్డాయి. ఫినాలే డిసెంబర్ 16వతేదీన ప్యూర్టోరికోలో జరగాల్సి ఉంది.కరోనా కారణంగా మిస్ వరల్డ్ 2021 ముగింపు పోటీలు తాత్కాలికంగా వాయిదా పడినాయి. అయితే పోటీదారులు, సిబ్బంది, సాధారణ ప్రజల ఆరోగ్యం, భద్రత ప్రయోజనాల కారణంగా నిర్వాహకులు ఈవెంట్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. తదుపరి 90 రోజుల్లో ప్యూర్టో రికోలోని జోస్ మిగ్యుల్ అగ్రెలాట్ కొలిజియంలో మిస్ వరల్డ్ పోటీల ముగింపు షెడ్యూల్ చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.



17 మందికి కొవిడ్

మిస్ వరల్డ్ 2021 పోటీదారులతో సహా 17 మంది సిబ్బంది కొవిడ్ బారిన పడ్డారు. కరోనా వచ్చిన వారిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మానస వారణాసి కూడా ఉన్నారు. పోటీదారులు, ప్రోడక్షన్ టీం సభ్యులు కరోనా బారిన పడటం వల్ల ప్రేక్షకుల భద్రత కోసం మిస్ వరల్డ్ పోటీల వాయిదా నిర్ణయం తీసుకున్నామని ఈవెంట్ ఆర్గనైజర్లు వివరించారు.23 ఏళ్ల మానస వారణాసి 70వ ప్రపంచ సుందరి పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.2019వ సంవత్సరంలో జరిగిన పోటీల్లో జమైకా దేశానికి చెందిన టోనీ-ఆన్ సింగ్ మిస్ వరల్డ్ 2019 కిరీటాన్ని గెలుచుకుంది.

Updated Date - 2021-12-17T15:46:36+05:30 IST