చంద్రుడికి తృటిలో తప్పిన ముప్పు!

ABN , First Publish Date - 2022-03-03T14:21:29+05:30 IST

చంద్రుడికి తృటిలో తప్పిన ముప్పు!

చంద్రుడికి తృటిలో తప్పిన ముప్పు!

  • సమీపం నుంచి దూసుకెళ్లిన రాకెట్‌ శకలం


కేప్‌ కేనవరాల్‌, మార్చి 2 : అంతరిక్ష వ్యర్థాల నుంచి చంద్రుడికి తృటిలో ముప్పు తప్పింది. అంతరిక్షంలో తిరుగుతున్న ఓ రాకెట్‌ శకలం.. శుక్రవారం చంద్రుడికి అతి సమీపం నుంచి దూసుకెళ్లింది. గంటకు 9,300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన ఈ శకలం.. పరిశోధకుల టెలిస్కోపులకు కూడా చిక్కలేదు. అది వెళ్లిన వేగానికి చంద్రుడి ఉపరితలంపై కొన్ని వందల కిలోమీటర్ల మేర చంద్ర ధూళి పైకెగసింది. ఈ అలజడితో.. అక్కడ ఏదో జరిగిందని గ్రహించిన శాస్త్రవేత్తలు.. ఆ తర్వాత రాకెట్‌ శకలం దూసుకెళ్లిన విషయాన్ని గుర్తించారు. 


దాదాపు 3 టన్నుల వ్యర్థాలు చంద్రుడి చుట్టూ ఓ బలమైన గోడలా పేరుకుని పోయి ఉండగా.. ఈ శకలం దూసుకొచ్చిన వేగానికి ఆ గోడకు 33 అడుగుల నుంచి 66 అడుగుల లోతైన బిలం ఏర్పడినట్లు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావాన్ని గుర్తించే దిశగా ప్రస్తుతం పరిశోధనలు సాగుతున్నాయి. ఇందుకు కొన్ని వారాల సమయం పట్టవచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమికి దగ్గరగా తిరిగే గ్రహశకలాల దిశ, గతిని నిరంతరం కనిపెట్టి ఉండే టెలిస్కోపుల సునిశిత దృష్టి నుంచి కూడా ఈ రాకెట్‌ తప్పించుకోవడం గమనార్హం. కాగా, అంతరిక్ష పరిశోధనల కోసం దశాబ్దం క్రితం చైనా ప్రయోగించిన రాకెట్‌గా శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. 2014లో చంద్రుడిపైకి చైనా అంతరిక్ష నౌకను మోసుకెళ్లిన రాకెట్‌ అని భావిస్తున్నారు. కానీ, చైనా మాత్రం దీన్ని ఖండిస్తోంది. నాడు తాము పంపిన రాకెట్‌.. తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి దగ్ధమైందని పేర్కొంది. 

Updated Date - 2022-03-03T14:21:29+05:30 IST