రెండ్రోజులుగా భార్య అద‌ృశ్యం.. ఎంత వెతికినా దొరకని ఆచూకీ.. తెల్లవారుజామున ఇంటి ముందు కనిపించిన దృశ్యం చూసిన ఆ భర్తకు..

ABN , First Publish Date - 2021-10-16T18:09:16+05:30 IST

రెండు రోజుల క్రితం అతడి భార్య అదృశ్యమైంది. తెలిసిన ప్రదేశాల్లో, బంధువుల ఇళ్లలో ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. రెండ్రోజులల తర్వాత తెల్లవారుజామున ఇంటి ముందు కనిపించిన దృశ్యం చూసి ఆ భర్త షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే..

రెండ్రోజులుగా భార్య అద‌ృశ్యం.. ఎంత వెతికినా దొరకని ఆచూకీ.. తెల్లవారుజామున ఇంటి ముందు కనిపించిన దృశ్యం చూసిన ఆ భర్తకు..

జార్ఖండ్: రెండు రోజుల క్రితం అతడి భార్య అదృశ్యమైంది. తెలిసిన ప్రదేశాల్లో, బంధువుల ఇళ్లలో ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. రెండ్రోజులల తర్వాత తెల్లవారుజామున ఇంటి ముందు కనిపించిన దృశ్యం చూసి ఆ భర్త షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే..


దియాషిపాడ ప్రాంతానికి చెందిన దీపక్ దేవోరి భార్య 35 ఏళ్ల జుమా దేవోరి. దీపక్ దినసరి కూలీగా పనిచేసేవాడు. అయితే కరోనా కాలంలో అతనికి పని లభించలేదు. దీంతో ఆ దంపతులకు ఇల్లు గడవడం కష్టంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో దీపక్ భార్య జుమ ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకుని ఇంటి కనీస అవసరాలను తీర్చింది. ఆ తర్వాత కూడా దీపక్‌కు పని లేకపోవడంతో తీసుకున్న లోన్ డబ్బులు తిరిగి చెల్లించడం కష్టమైంది. అప్పటినుంచి డబ్బులు తిరిగి కట్టాలని ఆ కంపెనీ వారు జుమను వేధించారు. దీంతో తీవ్రంగా ఒత్తిడికి గురైన ఆమె అక్టోబర్ 12న ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త ఎంత వెతికిన ఆమె ఆచూకీ లభించలేదు. రెండు రోజుల తర్వాత తెల్లవారుజామున ఇంటి ముందున్న చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ దీపక్‌కు కనిపించింది. ఆ దృశ్యం చూసి అతడు షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.


ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే లోన్ తీసుకున్న కంపెనీ వారు డబ్బు చెల్లించాలని వేధించడంతోనే తన భార్య చనిపోయిందని దీపక్ ఆరోపిస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.


Updated Date - 2021-10-16T18:09:16+05:30 IST