Amit Shah అబద్దాలను సాక్ష్యాలతో సహా నిరూపిస్తా: హరీష్‌రావు

ABN , First Publish Date - 2022-05-15T21:34:06+05:30 IST

కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) అబద్దాలను సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని మంత్రి హరీష్‌రావు

Amit Shah అబద్దాలను సాక్ష్యాలతో సహా నిరూపిస్తా: హరీష్‌రావు

హైదరాబాద్: కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) అబద్దాలను సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని మంత్రి హరీష్‌రావు (Harish Rao) సవాల్ విసిరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమిత్‌షా మాటలను ప్రజలు నమ్మరని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుకు టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చామో లేదో రికార్డులు చూపాలని నిలదీశారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని తప్పుబట్టారు. కేంద్రం ఇవ్వకున్నా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. మిషన్ భగీరథ (Mission Bhagiratha)కు కేంద్రం రూ.2500 కోట్లు కాదు.. రూ.2 కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలవుతుందని, పార్లమెంట్‌లో కేంద్రమంత్రే ప్రకటించారని హరీష్‌రావు గుర్తుచేశారు.

Updated Date - 2022-05-15T21:34:06+05:30 IST