మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-04-24T04:54:45+05:30 IST

జిల్లాలో ఇంటింటికి తాగునీరు అందించే మిషన్‌ భగీరథ పనులు త్వరి తగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ యాస్మిన్‌బాషా అధికారులను ఆదేశించారు.

మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ యాస్మిన్‌బాషా

- కలెక్టర్‌ యాస్మిన్‌బాషా

వనపర్తి అర్బన్‌, ఏప్రిల్‌ 23: జిల్లాలో ఇంటింటికి తాగునీరు అందించే మిషన్‌ భగీరథ పనులు త్వరి తగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ యాస్మిన్‌బాషా  అధికారులను ఆదేశించారు.  మిషన్‌ భగీరథ పను లపై శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గుంపుగట్టు, పో చిగుట్ట, పీర్లగుట్ట, కాశీంనగర్‌లో నిర్మించే వాటర్‌ ట్యాంక్‌ పనులు పూర్తి చేశామని అధికారులు తెలి పారు. 98.8కిలో మీటర్ల పైప్‌లైన్‌ వేశామన్నారు.  ఎక్కడ ఇబ్బందులు లేకుండా పనులు నాణ్యతగా చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో ఏజేసీ వేణుగోపాల్‌, మునిసిపల్‌ కమిషనర్‌, ఇంజ నీర్లు పాల్గొన్నారు.

  విచారణను వాయిదా వేయండి: న్యాయవాదులు

జిల్లా ట్రిబ్యునల్‌లో భూ వివాదాల కేసుల విచా రణను వాయిదా వేయాలని వ నపర్తి న్యాయవాదులు కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషాను కోరా రు. వనపర్తి సీనియర్‌ న్యాయవా దులు బక్షి చంద్రశేఖర్‌రావు, భరత్‌కుమార్‌, మన్మోహన్‌రావు, ఉత్తరయ్య, కృష్ణయ్య తదితరులు శుక్రవారం కలెక్టర్‌ను కలిసి విన తి పత్రం అందజేశారు. వనపర్తి జిల్లాలో ఈ నెల 28 నుంచి భూ వివాదాల కేసుల విచారణ ప్రా రంభం కానుందని, రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు ప్రమాద కరంగా పెరుగుతుండడంతో ఏకంగా హైకోర్టే కోర్టులకు సెలవులు ఇచ్చిందని న్యాయవాదులు క లెక్టర్‌ దృష్టికి తెచ్చారు. వనపర్తి కోర్టులలో 20మంది న్యాయవాదులు, కొందరు కక్షిదారులకు  కరోనా పాజిటివ్‌ వచ్చిందని వివరించారు. జిల్లాలో మొత్తం 196 కేసులు విచారణ జరపాల్సి ఉన్నదని ఒక్క న్యాయవాది ఐదారు కేసులను వాదించాల్సి వస్తుండటంతో కక్షిదారులకు న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు.  జిల్లా ట్రిబ్యునల్‌ విచారణ ను కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని కోరా రు.   తనకు కేసులు వాయిదా వేసే అధికారం లేన ది ప్రభుత్వం సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్‌ న్యాయవాదులకు సూచించారు.

Updated Date - 2021-04-24T04:54:45+05:30 IST