మిషన్‌ భగీరథ నీరు తాగాలి

ABN , First Publish Date - 2022-09-25T05:51:18+05:30 IST

మిషన్‌ భగీరథ నీరు తాగాలి

మిషన్‌ భగీరథ నీరు తాగాలి
మహిళలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆనంద్‌

ధారూరు, సెప్టెంబరు 24 :  సురక్షితమైన మిషన్‌ భగీరథ నీటినే తాగాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ సూచించారు. మండల పరిధిలోని మోమిన్‌కుర్ధు గ్రామంలో శనివారం నిర్వహించిన మీతో నేను కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భగీరథ నీటిని తాగేలా ప్రజలకు అవగహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఉపాధిహామీ కూలీల డబ్బుల జమ వ్యవహారంలో అవకతవకలపై విచారణ జరిపి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. విద్యుత్‌ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని ఆయన ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. అనంతరం మండల పరిధిలోని కుమ్మరిపల్లి తండాలో ఇటీవల మృతిచెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త కృష్ణనాయక్‌కు పార్టీ సభ్యత్వం ఉండటంతో ఆయన కుటుంబానికి  ఎమ్మెల్యే బీమా కింద రూ.2లక్షల  చెక్కును అందించారు. సర్పంచ్‌ ఉమాదేవి,   టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజునాయక్‌, ఏఎంసీ చైర్మన్‌ సంతోష్‌, వైస్‌ చైర్మన్‌ అంజయ్య, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, నరోత్తంరెడ్డి, వెంకట్‌రెడ్డి, రాజుగుప్త పాల్గొన్నారు.


Updated Date - 2022-09-25T05:51:18+05:30 IST