మిస్టర్‌ నేషనల్‌ యూనివర్స్‌కు Tamilnadu యువకుడు

Published: Sat, 28 May 2022 10:52:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మిస్టర్‌ నేషనల్‌ యూనివర్స్‌కు Tamilnadu యువకుడు

అడయార్‌(చెన్నై): థాయిలాండ్‌ వేదికగా జరుగనున్న నాలుగో ఎడిషన్‌ మిస్టర్‌ నేషనల్‌ యూనివర్స్‌ పోటీలకు రాష్ట్రానికి చందిన శరత్‌ మనోహరన్‌ ఎంపికయ్యారు. ఈ పోటీల్లో భారత్‌తో పాటు ఫిలిప్పీన్స్‌, థాయిలాండ్‌, బ్రెజిల్‌, జర్మనీ, మలేసియా, ఫ్రాన్స్‌, పాకిస్తాన్‌ సహా 25కు పైగా దేశాలు పాల్గొంటున్నాయి. ఈ నెల 29 నుంచి జూన్‌ 6వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో ఫిట్నెస్‌, టాలెంట్‌, స్టైలింగ్‌, యాటిట్యూడ్‌, బిహేవియర్‌, డిజైనర్‌ వాల్క్‌, స్మిమ్‌వేర్‌ వాల్క్‌, చివరగా టెక్సెడో, క్యూ అండ్‌ ఏ రౌండ్‌ ఉంటుంది. కాగా, శరత్‌ మనోహరన్‌ గోవా వేదికగా 2020-21లో జరిగిన రుబరు మిస్టర్‌ సౌత్‌ ఇండియాగా నిలిచాడు. ఇపుడు మిస్టర్‌ నేషనల్‌ యూనివర్స్‌ పోటీలకు సిద్ధమవుతున్నాడు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.