
క్రైస్ట్‌చర్చ్: తన రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదని టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పింది. వరల్డ్‌క్‌పతో కెరీర్‌కు గుడ్‌బై చెబుతానని ఇంతకుముందు మిథాలీ చూచాయగా తెలిపింది. 39 ఏళ్ల రాజ్‌కు ఇది ఆరో వరల్డ్‌కప్. ‘సెమీ్‌సకు అర్హత సాధించకపోవడంతో ఎంతో నిరాశ చెందా. ఓటమిని జీర్ణించుకోవడానికి కొంత సమయం పడుతుంది. స్థిమితంగా ఆలోచించి భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటా’ అని మిథాలీ పేర్కొంది. పేసర్ జులన్ గోస్వామి ఆడకపోవడం ఒకరకంగా తమ అవకాశాలను దెబ్బతీసిందని మిథాలీ అభిప్రాయపడింది.