భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ Massive Record

ABN , First Publish Date - 2022-03-12T12:27:42+05:30 IST

మహిళల ప్రపంచకప్‌లో మిథాలీరాజ్ శనివారం భారీ రికార్డును నమోదు చేశారు...

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ Massive Record

హామిల్టన్ : మహిళల ప్రపంచకప్‌లో మిథాలీరాజ్ శనివారం భారీ రికార్డును నమోదు చేశారు.మిథాలీరాజ్ ఇప్పుడు మహిళల ప్రపంచ కప్‌లలో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నారు.ప్రస్తుతం జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌లో భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ శనివారం ఆడుతున్నారు. హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరిగిన టోర్నమెంట్‌లోని తమ మూడవ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో భారత్ జట్టు ఆడుతోంది.మిథాలీ రాజ్ ఇప్పుడు మహిళల ప్రపంచ కప్ చరిత్రలో కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడి రికార్డును నెలకొల్పారు. 23 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆస్ట్రేలియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్‌ సాధించిన రికార్డును మిథాలీరాజ్ దాటేశారు. 


ఇప్పటి వరకు మిథాలీ 23 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో ఆడారు.ఇప్పటి వరకు జరుగుతున్న టోర్నీలో భారత్ ఒక మ్యాచ్‌లో ఓడి ఒక మ్యాచ్‌లో గెలిచి, వెస్టిండీస్‌పై విజయం సాధించి రికార్డును కైవసం చేసుకోవాలని మిథాలీ భావిస్తున్నారు.భారత జట్టు టోర్నమెంట్ ఓపెనర్‌లో పాకిస్తాన్‌ను ఓడించింది. అయితే వారి తర్వాతి గేమ్‌లో న్యూజిలాండ్‌తో ఘోర పరాజయాన్ని చవిచూసింది.భారత బౌలింగ్ విభాగంలో పూజా వస్త్రాకర్ నాలుగు వికెట్లు పడగొట్టి మంచి ఫామ్‌లో ఉన్నారు. 


Updated Date - 2022-03-12T12:27:42+05:30 IST