Mithun Chakraborty: సరైన సమయంలో పంచ్ ఇస్తానంటోన్న మిథున్ చక్రవర్తి

ABN , First Publish Date - 2022-09-25T03:25:04+05:30 IST

కోల్‌కతా: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ( BJP leader Mithun Chakraborty), సినీ నటుడు మిథున్ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Mithun Chakraborty: సరైన సమయంలో పంచ్ ఇస్తానంటోన్న మిథున్ చక్రవర్తి

కోల్‌కతా: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ( BJP leader Mithun Chakraborty), సినీ నటుడు మిథున్ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సరైన సమయంలో పంచ్ ఇస్తానని చెప్పుకొచ్చారు. తాను ఒక ఫైటర్‌నని, తొమ్మిది సార్లు బాక్సింగ్‌ రింగ్‌లో దెబ్బలు తిన్నా పదోసారి తాను కొట్టే పంచ్‌తో అవతలివాడిక లేవలేడని మిథున్ చెప్పారు. సినీ రంగంలో తనను 9 సార్లు బయటకు గెంటేసే ప్రయత్నం చేశారని, చివరకు పదోసారి అందరి నోళ్లూ మూయించానన్నారు. రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారని విలేకరులు ప్రశ్నించినప్పుడు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉంటేనే విజేతగా నిలుస్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంతా ముజుందార్‌(Sukanta Majumder) తో కలిసి ఆయన దక్షిణ దినాజ్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడారు. 


బెంగాల్ ఎస్ఎస్‌సీ కుంభకోణంలో పార్థా చటర్జీ (Partha Chatterjee) సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ (Arpita Mukherjee) ఫ్లాట్‌లో పెద్ద ఎత్తున నగదు దొరికిన ఘటనపై మిథున్ చక్రవర్తి స్పందించారు. అంత డబ్బు తన మొత్తం కెరీర్‌లో సంపాదించలేకపోయానని, వీళ్లంతా ఎలా సంపాదిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. 


గతంలోనూ మిథున్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. 38 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో (Trinamool MLA) 21 మంది తనతో టచ్‌లో ఉన్నారని చెప్పి కలకలం రేపారు. 

Updated Date - 2022-09-25T03:25:04+05:30 IST