మమ్మల్ని భయపెడుతున్నారు: అస్సాం మంత్రి

ABN , First Publish Date - 2021-07-30T21:47:15+05:30 IST

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోను చూపిస్తూ మిజోరాం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా అస్సా ప్రజలు ఎవరూ మిజోరాంవైపు వెళ్లవద్దని అశోక్ సింఘాలు సూచించారు.

మమ్మల్ని భయపెడుతున్నారు: అస్సాం మంత్రి

గువాహటి: మిజోరాం పౌరులు.. అస్సాం ప్రజల్ని బెదిరిస్తున్నారని, భయపెడుతున్నారని అస్సాం మంత్రి అశోక్ సింఘాల్ అన్నారు. అస్సాం-మిజోరాం రాష్ట్రాల మధ్య నెలకొన్ని అసాధారణ పరిస్థితులపై ఆయన గురువారం స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోను చూపిస్తూ మిజోరాం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా అస్సా ప్రజలు ఎవరూ మిజోరాంవైపు వెళ్లవద్దని అశోక్ సింఘాలు సూచించారు.


‘‘అవతలి వైపు నుంచి ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కల్పించుకుంటే గాని సమస్య సద్దుమణిగేలా లేదు. సరిహద్దు నుంచి మా పోలీసులను మేము వెనక్కి పిలిపించాం. కానీ మిజోరాం పోలీసులు ఇంకా సరిహద్దులోనే ఉన్నారు. అంతే కాదు, సోషల్ మీడియాలో ఓ వీడియో కనిపించింది. మిజోరాం పౌరులు ఆయుధాలు పట్టుకుని మమ్మల్ని, మా ప్రజల్ని భయపెడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఎవరి బాధ్యతా మేము తీసుకోం. అస్సాం ప్రజలు ఎవరూ మిజోరాంకు వెళ్లవద్దు’’ అని సింఘాల్ అన్నారు.

Updated Date - 2021-07-30T21:47:15+05:30 IST