జగన్‌ పాలనలో కాపులకు అవమానాలే

ABN , First Publish Date - 2022-06-28T05:24:58+05:30 IST

సిఎం జగన్మోహనరెడ్డి పాలనలో కాపులకు అన్యాయాలు, అవమానాలే మిగిలాయని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు.

జగన్‌ పాలనలో కాపులకు  అవమానాలే
ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌

మ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ 

రేపల్లె, జూన్‌ 27: సిఎం జగన్మోహనరెడ్డి పాలనలో కాపులకు అన్యాయాలు, అవమానాలే మిగిలాయని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాపు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని, కాపుల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిననాటి నుంచి అడుగడుగునా కాపులపై కక్షసాధింపుచర్యలకు పాల్పడుతున్నారన్నారు. మొన్న విదేశీ విద్య రద్దు, ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ రద్దు, నేడు కాపు నేస్తం పథకం నిలిపివేశారన్నారు. కాపులకు సంక్షేమ పథకాలు దూరం చేస్తూ మరో వైపు ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలా కాపుల్ని అణచివేస్తున్నారని తెలిపారు.  టీడీపీ హయాంలో కాపు విద్యార్థులకు విదేశీ విద్య కోసం ఏటా రూ.1,500కోట్లు ఖర్చు  చేశామని తెలియజేశారు. విదేశాలకు వెళ్ళే కాపు విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ టీడీపీ ప్రభుత్వం రూ.10లక్షలు ఇవ్వగా జగన్‌ ప్రభుత్వం రూ.5లక్షలకు తగ్గించిందన్నారు. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే కాపు విద్యార్థులకు డిల్లీలోని ఏపీ భవన్‌లో వసతి ఏర్పాటు చేస్తే జగన్‌ దానిని రద్దు చేసి ఏపీ భవన్‌ను వైసీపి భవన్‌గా మార్చారన్నారు. కాపు కార్పోరేషన్‌ను అలంకారప్రాయంగామార్చి కాపు యువతకు ఉపాధి అవకాశాలులేకుండా అన్యాయం చేశారన్నారు. అన్ని వర్గాలకు ఇచ్చే పింఛన్‌ను అమ్మ ఒడి తదితర పఽథకాల నిధులను కాపు సంక్షేమంలో చూపి దగా చేస్తున్నారన్నారు. ఉమ్మడి పఽథకాల్లో నిధులనే భాగాలుగా విడదీసి వెల్ఫేర్‌ పద్దులో చూపుతూ మోసం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పధకాలను రాష్ట్ర పధకాల్లో కలిపేశారన్నారు. పాత పథకాలకు ముందు వైఎస్సార్‌ పేరు చేర్చి కొత్తపధకాలుగా ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే వాటిని జగన్‌ రద్దుచేసి కాపుల పట్ల తనకున్న ద్వేషాన్ని బహిరంగంగా చాటుకున్నారన్నారు. నామినేటెట్‌ పోస్టులో సైతం కాపులకు ప్రాధాన్యం ఇవ్వకుండా వారిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్న జగన్‌ రెడ్డికి బుద్ది చెప్పేందుకు కాపు సోదరులు సిద్ధంగా ఉన్నారన్నారు. 


Updated Date - 2022-06-28T05:24:58+05:30 IST