'గులాబ్' ప్రభావంపై పోలవరం ఎమ్మల్యే సమీక్ష

Sep 27 2021 @ 10:29AM

జంగారెడ్డిగూడెం: గులాబ్ తుఫాను ప్రభావంతో రాత్రి నుండి పోలవరం నియోజకవర్గం అంతటా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రస్తుత పరిస్థితి, తీసుకున్న చర్యలపై ఎమ్మేల్యే బాలరాజు  అధికారులతో సమీక్షించారు. వాగులు పొంగుతున్న దృష్ట్యా వాగులు వద్ద పికెట్ ఏర్పాటు చేసి ప్రయాణికులను వాగులు దాటకుండా చూడాలన్నారు. రెవిన్యూ, పోలీసు, పంచాయితీ, వైద్య, వ్యవసాయ శాఖ  సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి ప్రాణ, ఆస్తి, పంట నష్టాలను నివారించాలని సూచించారు. సచివాలయ సిబ్బంది అందరూ అందుబాటులో ఉంటూ గ్రామాల్లో పరిస్థితులు అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు.


సర్పంచులు, జిల్లా పరిషత్, మండల పరిషత్ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ విపత్తును ఎదుర్కోవటానికి అధికారులకు సహకరిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని, వారి పరిధిలో క్షేత్ర స్ధాయిలో పర్యటించి ప్రజలకు అందించాల్సిన సహాయంపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ పరిధిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని... సురక్షిత ప్రదేశంలో తలదాచుకోవాలని కోరారు. కరెంటు స్తంబాలను పట్టుకోవద్దని ఎమ్మెల్యే బాలరాజు హెచ్చరించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.