అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు

ABN , First Publish Date - 2021-01-22T03:54:19+05:30 IST

మంత్రి కేటీఆర్‌ సహకారంతో మునిసిపాలిటీలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలను పూర్తి స్థాయిలో నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు
రోడ్డు పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి

    గద్వాల టౌన్‌, జనవరి 21: మంత్రి కేటీఆర్‌ సహకారంతో మునిసిపాలిటీలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలను పూర్తి స్థాయిలో నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని 23వ వార్డు పరిధిలోని తెలుగుపేటలో రూ.10లక్షలు, 26వ వార్డు పరిధిలోని వేదనగర్‌లో రూ.10లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులకు గురువారం  మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుపేట శివాలయం వద్ద కల్యాణమండపాన్ని నిర్మిస్తామన్నారు. కౌన్సిలర్లు అనిత, లక్ష్మి, మురళి, నరహరిగౌడ్‌, కృష్ణ, సీను, నాగ రాజు, మహేశ్‌, కో ఆప్షన్‌ సభ్యులు శివమ్మ, శ్రీనివాసరెడ్డి, కోటేశ్‌ పాల్గొన్నారు.

 

జములమ్మ ఆలయ చైర్మన్‌గా సతీష్‌ కుమార్‌

    గద్వాల రూరల్‌: జములమ్మ ఆలయ పాలకవర్గ చైర్మన్‌గా కుర్వ సతీశ్‌కుమార్‌ ఎంపికయ్యారు. ఆయనతో పాటు మరో 12 మందిని సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన చైర్మన్‌ సతీష్‌కుమార్‌ గురువారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తామని ఆయనకు ఎమ్మెల్యే సూచించారు.  రైతుబంధు చైర్మన్‌ చెన్నయ్య, ఎంపీపీ ప్రతాప్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సతీష్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


త్వరలోనే అందుబాటులోకి ప్రజావైద్యశాల

    గద్వాల/కేటీదొడ్డి, జనవరి 21: త్వరలోనే కేటీదొడ్డిలో ప్రజావైద్యశాలను అందు బాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఎమ్మెల్యే నిధులతో ఏర్పాటుచేసిన ప్రజావైద్యశాలను గురువారం ఆయన ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో చందునాయుడుతో కలిసి పరిశీలించారు. వైద్యశా లతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సొంతభవనాలు ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామన్నారు. గట్టు ఎంపీపీ విజయ్‌, నాయకులు చక్రధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T03:54:19+05:30 IST