
అమరావతి: రాష్ట్రంలో మహిళలకు సీఎం జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారన్న నమ్మకం లేదని టీడీపీ ఎమ్మెల్యే భవానీ అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ అందరూ తన అక్కలు, చెల్లెమ్మలు అని చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరగడంలేదని, వైసీపీ అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం చేస్తానని పాదయాత్రలో చెప్పారని, గన్ కంటే ముందు జగన్ వస్తారని స్లోగన్లు కూడా వచ్చాయని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఆడబిడ్డల ఏడుపు ఆయనకు ఎందుకు వినబడడంలేదని ప్రశ్నించారు. జంగారెడ్డి గూడెంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా సహజ మరణాలని చెబుతూ ఆ ఘటనను పక్కదోవపట్టించారని ఆమె మండిపడ్డారు. ఇప్పుడు ఆశావర్కర్లు, అంగన్ వాడీ మహిళలు తమ సమస్యలపై పోరాటం చేస్తున్నారని... వారికి న్యాయం చేస్తారనే నమ్మకం లేదని ఎమ్మెల్యే భవానీ అన్నారు.
ఇవి కూడా చదవండి