సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2020-12-04T04:21:37+05:30 IST

అధికారులు తమ విధులను సంతృస్తికరంగా నిర్వహించాలని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

సాదాసీదాగా సర్వసభ్య సమావేశం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

- ప్రజల సమస్యలపై మాట్లాడని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు 



కృష్ణ, డిసెంబరు 3 : అధికారులు తమ విధులను సంతృస్తికరంగా నిర్వహించాలని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఎంపీపీ పూర్ణిమ అధ్యక్షతన గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడారు. పంచాయతీ కార్యద ర్శులు, అధికారులు సమావేశం మొదలు నుంచి ఎజెండాలో అధికారులు చదివి వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రెవెన్యూ, విద్య, విద్యుత్‌, ఐసీడీఎస్‌, పంచాయతీ, విషన్‌ భగీరథ, ఆరోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీప్పవని హెచ్చరించారు. ఒక పక్క ప్రభుత్వం రైతుల నుంచి వరి కొనుగోలు చేస్తూ రైతులకు కావాల్సిన బస్తాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్న రైతుల గురించి సమావేశంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు మాట్లాడకపోవ డంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ అంజనమ్మ పటీల్‌, సింగిల్‌విండో చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు వ్యవసాయం, విద్యుత్‌ అధికారులు పాల్గొన్నారు. 


నర్వలో చెక్కుల పంపిణీ


నర్వ : నర్వ తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మెహన్‌రెడ్డి, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లోని 17 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు ఆత్మకూర్‌ మార్కెట్‌ మాజీ చైర్మన్‌, న్యాయవాది వై తిప్పారెడ్డి చేయించిన వెండి కిరీటాలను రామాలయంలోని విగ్రహాలకు తొడిగింపు పూజాకార్యక్రమంలొ ఎమ్మెల్యే పాల్గొన్నారు. తహసీల్దార్‌, గ్రామ సర్పంచ్‌ పెద్దింటి సంధ్య, ఉప సర్పంచ్‌ నర్సింహ్మారెడ్డి, విండో చైర్మన్‌ బంగ్ల లక్ష్మీకాంతారెడ్డి, మాజీ ఎంపీటీసీ రాధ మ్మ, నాయకులు, రవీందర్‌రెడ్డి, ఎంపీపీ జయరాములు శెట్టి, మహేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ వెంకటేశ్వర్‌ రావు, సురేందర్‌ రెడ్డి  పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:21:37+05:30 IST