YSRCP ఎమ్మెల్యే ధనలక్ష్మి అలిగారు..!!

ABN , First Publish Date - 2021-10-25T06:02:04+05:30 IST

YSRCP ఎమ్మెల్యే ధనలక్ష్మి అలిగారు..!!

YSRCP ఎమ్మెల్యే ధనలక్ష్మి అలిగారు..!!

  • గ్రంథాలయ ప్రారంభోత్సవానికి
    కలెక్టర్‌ సకాలంలో రాలేదని అలక
    రంపచోడవరానికి తిరుగు ప్రయాణం
    అధికారుల తీరును నిరసిస్తూ నేతల ధర్నా



చింతూరు, అక్టోబరు 24 :
ఎమ్మెల్యే ధనలక్ష్మి అధికారులపై అలిగారు. గ్రంథాలయ భవన ప్రారంభోత్స కార్యక్రమం చేపట్టకుండానే రంపచోడవరం వెళ్లిపోయారు. దీంతో గ్రంథాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం నిలిచిపోయింది. ఆదిమ గురుకుల కళాశాల ప్రాంగణంలో నిర్మించిన గ్రంథాలయ భవన ప్రారంభోత్సవంతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం కలెక్టర్‌ సీహెచ్‌ హరికిరణ్‌ చింతూరు వచ్చారు.  ఎమ్మెల్యే కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చారు.


కలెక్టర్‌ చింతూరు నుంచి నేరుగా భద్రాచలం వెళ్లి శ్రీసీతారామచంద్రమూర్తి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి తిరిగి చింతూరు మండలం చేరుకున్న కలెక్టర్‌ ఏడుగురాళ్లపల్లిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో కలెక్టర్‌ చింతూరు రావడంలో ఆలస్యం జరిగింది. ఎమ్మెల్యే కలెక్టర్‌ రాక కోసం కొద్దిగంటలపాటు వేచి చూశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ను కలెక్టర్‌ పాటించలేదన్న అభిప్రాయంతో పాటు గంటల తరబడి వేచి చూసినా కలెక్టర్‌ గ్రంథాలయ ప్రారంభోత్సవానికి హాజరుకాకపోవడంతో ఎమ్మెల్యే అలిగారు. చివరకు గ్రంథాలయ భవనం ప్రారంభించకుండానే ఆమె తిరిగి రంపచోడవరం వెళ్లిపోయారు.


 చివరకు గ్రంథాలయ భవన ప్రదేశానికి చేరుకున్న కలెక్టర్‌ ఎమ్మెల్యే అలిగి వెళ్లిన విషయం తెలుసుకుని తాను కూడా గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించకుండానే కాకినాడకు తిరిగి వెళ్లారు. ఎమ్మెల్యే గంటల తరబడి వేచి చూసినప్పటికీ కలెక్టర్‌ హాజరు కాకపోవడాన్ని నిరసిస్తూ వైసీపీ నాయకులు, ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిఽధులు అధికారుల తీరుని నిరసిస్తూ ధర్నాకు దిగారు. దీంతో ఐటీడీఏ పీవో వెంకటరమణ ధర్నా చేస్తున్న వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి నచ్చచెప్పి ధర్నాను విరమింపజేశారు.

Updated Date - 2021-10-25T06:02:04+05:30 IST