‘పాజిటివ్‌’ వచ్చినా అధైర్యపడొద్దు

May 8 2021 @ 23:58PM

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

రేగొండ, మే 8: కరోనా పరీక్ష నిర్ధారణలో పాజిటివ్‌ వచ్చిన వారెవరూ అఽధైర్యపడొద్దని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శనివారం పరిశీలించారు.  కరోనా బారిన పడిన వారు హోం ఐసోలేషన్‌ లేదా ప్రభుత్వ ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందాలన్నారు. ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దన్నారు.  వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కరోనా టెస్టులకు దూరంగా చేపట్టాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆయన వెంట వైద్యాధికారి మమతాదేవి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ పాపిరెడ్డి, నాయకులు సాయిని ముత్యం, మైస బిక్షపతి, ప్రతాపరెడ్డి తదితరులు ఉన్నారు. 


Follow Us on: