టీటీడీ బోర్డు మెంబర్‌ పదవిపై బాబురావు అసంతృప్తి

ABN , First Publish Date - 2021-09-16T03:10:14+05:30 IST

తనకు టీటీడీ బోర్డు మెంబర్‌‌గా పదవి ఇవ్వడంపై ఎమ్మెల్యే

టీటీడీ బోర్డు మెంబర్‌ పదవిపై బాబురావు అసంతృప్తి

విశాఖ: తనకు టీటీడీ బోర్డు మెంబర్‌‌గా పదవి ఇవ్వడంపై ఎమ్మెల్యే గొల్ల బాబురావు అసంతృప్తి వ్యక్తం చేసారు. టీటీడీ బోర్డు మెంబర్ పదవిని గొల్ల బాబురావు తిరస్కరించారు. మంత్రి పదవిని ఆశిస్తే, తనకు టీటీడీ పదవి ఇవ్వడం అవమానించడమేనని బాబురావు అన్నారు. పాదయాత్ర సమయంలో జగన్ వెంట నడిచిన వారిలో తాను ముందు వరుసలో ఉన్నానని బాబురావు పేర్కొన్నారు. తనకు అన్యాయం జరిగిందంటూ పార్టీ నేతల్ని బాబురావు నిలదీసారు. తాను దళితుడిని కాబట్టే ఎన్నో అవమానాలంటూ సన్నిహితుల దగ్గర ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. 

Updated Date - 2021-09-16T03:10:14+05:30 IST