కొవిడ్‌ ఆస్పత్రిలో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2021-05-15T05:54:05+05:30 IST

లింగంగుంట్లలోని ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రి లో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

కొవిడ్‌ ఆస్పత్రిలో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆకస్మిక తనిఖీ
కొవిడ్‌ ఆస్పత్రిలో సిబ్బందితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి

అక్రమ వసూళ్ళకు పాల్పడిన నలుగురు సిబ్బంది సస్పెన్షన్‌

మృత దేహాల తరలింపులో అక్రమాలకు పాల్పడితే  తక్షణమే విధుల నుంచి తొలగించాలి

నరసరావుపేట, మే 14 : లింగంగుంట్లలోని ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రి లో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, బాధితుల వద్ద అక్రమ వసూళ్ళకు పాల్పడిన నలుగురు సిబ్బందిని సస్పండ్‌ చేయించారు. వైద్యులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. పారిశుధ్యం పనుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అటువంటి వారిని తక్షణ మే విధుల నుంచి తొలింగించాలని అధికారులను గోపిరెడ్డి ఆదేశించారు. మునిసిపాల్టీ పారిశుధ్య పనులను వారి ఆఽధీనంలోకి తీసుకోవాలని సూ చించారు. మృతదేహాల తరలింపు, బాధితులు ఆస్పత్రిలో చేరే సమయం లో అక్రమ వసూళ్ళకు పాల్పడితే అటువంటి వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది ఎంతో కష్టపడి ప్రతి రోజు 200 మంది కొవిడ్‌ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నా రని కేవలం పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదన్నారు. పెద్ద ఎత్తున వైద్య సేవలు అందించే సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ టం సహజమని, వీటిని  బూతద్ధంలో చూడవద్దని, ఇక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వెనువెంటనే వాటిని పరిష్క రించడం జరుగుతుందన్నారు. మందుల కొరకు రోగులను బయటకు పంపించవద్దని, ఉచితంగా మందులు ఇవ్వాలని చెప్పారు. రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్‌ల సరఫరా తక్కువగా ఉన్నందున వ్యాధి తీవ్రతను బట్టి వైద్యు లు ఏ రోగికి అవసరమో గుర్తించి ఇంజక్షన్‌లు ఇస్తారని తెలిపారు. ఇందుకోసం రిజిష్టర్‌ నిర్వహించాలన్నారు. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగటానికి వీలు లేదన్నారు. రోగులు కూడా బాధ్యతతో మెలగాలని, ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నందున శనివారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నియమ కాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది కొవిడ్‌ భారిన పడ్డారని చెప్పారు. కొవిడ్‌ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని గోపిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, ఆర్‌ఎంవో కె.చంద్రశేఖరరెడ్డి, కమిషనర్‌ కె.రామచంద్రారెడ్డి, డీఎస్పీ విజయ భాస్కరరావు, డీఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-15T05:54:05+05:30 IST