నేడు అమెరికాకు ఎమ్మెల్యే గోరంట్ల

ABN , First Publish Date - 2022-05-16T06:36:36+05:30 IST

రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోమవారం అమెరికా బయలుదేరి వెళుతున్నారు.

నేడు అమెరికాకు ఎమ్మెల్యే గోరంట్ల

రాజమహేంద్రవరం సిటీ, మే 15: రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోమవారం అమెరికా బయలుదేరి వెళుతున్నారు. అమెరికాలో తానా ఆధ్వర్యంలో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనాలని గోరంట్లకు తానా ఆహ్వానం పంపింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 7:30 గంటలకు రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ వెళ్లి అక్కడ నుంచి అమెరికా బయలుదేరి వెళ్తారు.  

Updated Date - 2022-05-16T06:36:36+05:30 IST