అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు
ఝరాసంగం, జనవరి 24 : మండల కేంద్రమైన ఝరాసంగంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్, పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం జరగనున్నది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు రానుండడంతో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆదివారం ఆలయ ఆవరణలోని ఏర్పాట్లును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన రైతువేదిక నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీవో సుజాత, సర్పంచ్ జగదీశ్వర్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, ఆలయ ఈవో మోహన్‌రెడ్డి ఉన్నారు.