ఎమ్మెల్యే కాకాణి ఇంటి ముందు నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు
పొదలకూరు, మార్చి 27 : మండలంలోని వావింటపర్తి పాఠశాల సందర్శన సమయంలో ఉపాధ్యాయిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన పొదలకూరు ఎంఈవో ఎం.బాలకృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్ మండల నాయకులు ఎమ్మెల్యే కాకాణి నివాసం ముందు ఆదివారం నిరసన తెలిపారు. అనంతరం విచారణ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు.