
హైదరాబాద్: కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలు చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(jagga reddy)అన్నారు.బీజేపీ సర్కార్ ఎలక్షన్ కమిషన్‌ను డమ్మీ చేసిందని ఆయన ఆరోపించారు. బీజేపీ(bjp) దొడ్డి దారిలో రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.అధికారంలో లేని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడుతోందని విమర్శించారు. బీజేపీయేతర నేతలను ఇబ్బంది పెడుతున్నారన్నారు.రాహుల్‌గాంధీ పాదయాత్రలకు వెళ్లకుండా బీజేపీ కుట్రలు చేసిందన్నారు.తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు.అలెగ్జాండర్ పతనమైనట్లే.బీజేపీ కూడా పతనం అవుతుందన్నారు.
ఇవి కూడా చదవండి