
హైదరాబాద్: బండి సంజయ్ బట్టేబాజ్, బ్రెయిన్ లెస్ ఎంపీగా మారిపోయారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. రైతులకు బండి సంజయ్ రాసిన లేఖలో అబద్దాలు తప్ప ఏమీ లేవన్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు తెలంగాణకు నలువైపులా శనిలా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బండి సంజయ్ తెలంగాణలో పుట్టాడా గుజరాత్‌లో పుట్టాడా అనే అనుమానం కలుగుతోందన్నారు. బీజేపీ నేతలు ధాన్యం సేకరణ పై ఒక్కొక్కరు ఒక్క తరహాలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ బొందను బండి సంజయ్‌యే తవ్వుతున్నాడని విమర్శించారు. పీసీసీ చీఫ్ రేవంత్ బీజేపీకి మోడీకి సామంతుడిలా మారారని అన్నారు. బీజేపీ ఏజెంట్‌లా రాహుల్ గాంధి ఆలోచనకు వ్యతిరేకంగా రేవంత్ పని చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. సెక్షన్ 8 గురించి మాట్లాడుతూ తెలంగాణ వ్యతిరేకిలా రేవంత్ మారారని చెప్పారు.
ఇవి కూడా చదవండి